ఏపీ ఈఎస్ఐకు పరికరాలు సరఫరా చేయవద్దు: సప్లయర్స్ అసోసియేషన్

ABN , First Publish Date - 2021-11-26T03:58:33+05:30 IST

ఏపీలో ఈఎస్ఐ ఆస్పత్రులకు ఎటువంటి వైద్య పరికరాలు సరఫరా చేయవద్దని ట్విన్ సిటీ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది..

ఏపీ ఈఎస్ఐకు పరికరాలు సరఫరా చేయవద్దు: సప్లయర్స్ అసోసియేషన్

అమరావతి: ఏపీలో ఈఎస్ఐ ఆస్పత్రులకు ఎటువంటి వైద్య పరికరాలు సరఫరా చేయవద్దని ట్విన్ సిటీ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఏడాది నుంచి ఏపీ ప్రభుత్వం తమ సభ్యులకు రూ. 200 కోట్ల రూపాయలుపైగా బకాయిలు ఉందని అసోసియేషన్ చెబుతోంది. బకాయిల గురించి అడిగితే అధికారుల నుంచి సమాధానం రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. బకాయిల గురించి అడుగుదామంటే ఉన్నతాధికారులు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అసోసియేషన్ పేర్కొంది. ఎటువంటి వైద్య పరికరాలు సరఫరా చేయవద్దని సభ్యులను అసోసియేషన్ కోరింది. ఇప్పటికే మెడికల్ డివైసెస్ అసోసియేషన్ రెడ్ నోటీస్ జారీ చేసిన విషయాన్ని ట్విన్ సిటీ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ గుర్తు చేసింది. 

Updated Date - 2021-11-26T03:58:33+05:30 IST