హుజూర్‌నగర్‌కు ఈఎ్‌సఐ ఆసుపత్రి

ABN , First Publish Date - 2021-07-31T06:05:00+05:30 IST

హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి ప్రభుత్వం ఈఎస్‌ఐ ఆసుపత్రిని మంజూరు చేసింది. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వం జీఓ నెం.26 విడుదల చేసింది.

హుజూర్‌నగర్‌కు ఈఎ్‌సఐ ఆసుపత్రి
హుజూర్‌నగర్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో పాల్గొన్న కేసీఆర్‌ (పైల్‌)

మంజూరుచేస్తూ ప్రభుత్వం జీవో  

కృతజ్ఞత సభలో కేసీఆర్‌ హామీ 

హర్షం వ్యక్తంచేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి 

హుజూర్‌నగర్‌, జూలై 30: హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి ప్రభుత్వం ఈఎస్‌ఐ ఆసుపత్రిని మంజూరు చేసింది. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వం జీఓ నెం.26 విడుదల చేసింది. 2019లో హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో గెలిచిన అనంతరం అక్టోబర్‌ 26న పట్టణంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఈఎ్‌సఐ ఆసుపత్రి మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అంతకుముందు రోడ్‌షోలో మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డిలు హామీ ఇవ్వగా, నియోజకవర్గ ప్రజల కల ఇప్పటికి నెరవేరింది. ఇదిలా ఉండగా నియోజకవర్గంలోని మేళ్లచెర్వులో రూ.2కోట్లతో ఈఎ్‌సఐ ఆసుపత్రిని ఏర్పాటుచేయనున్నారు. జీఓ విడుదల కాక ముందే భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. మేళ్లచెర్వు ప్రాంతంలో అత్యధికంగా సిమెంట్‌ పరిశ్రమలు ఉండడంతో మండలకేంద్రంలో ఈఎ్‌సఐ ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్‌ హామీ ఇచ్చిన నాటి నుంచి ఈఎ్‌సఐ ఆసుపత్రి జీఓ విడుదలకు ఎమ్మెల్యే సైదిరెడ్డి తీవ్రంగా కృషి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డిల సహకారంతో ఈఎ్‌సఐ ఆసుపత్రి మంజూరైనట్లు తెలిపారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని చింతలపాలెం, మేళ్లచెర్వు, మఠంపల్లి మండలాల్లో అత్యధికంగా సిమెంట్‌ పరిశ్రమలు ఉండడంతోపాటు హుజూర్‌నగర్‌లో ఉన్న రైస్‌మిల్లుల్లో వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారందరి ఆరోగ్యాల దృష్ట్యా సీఎం ఆసుపత్రి మంజూరుచేయడం హర్షనీయమన్నారు. ఈఎ్‌సఐ ఆసుపత్రి మంజూరుపట్ల హుజూర్‌నగర్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చనరవి, వైస్‌చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, చిట్యాల అమర్‌నాథ్‌రెడ్డి, అమర్‌ తదితరులు హర్షంవ్యక్తం చేశారు. 

 

Updated Date - 2021-07-31T06:05:00+05:30 IST