టెలీహెల్త్‌పైనే నోట్‌ పంపా: అచ్చెన్న

ABN , First Publish Date - 2020-02-22T09:49:07+05:30 IST

తెలంగాణలో అమలవుతున్న టెలీహెల్త్‌ సర్వీసెస్‌ను ఇక్కడా అమలు చేయాలని కేవలం నోట్‌ మాత్రమే ఇ చ్చానని మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

టెలీహెల్త్‌పైనే నోట్‌ పంపా: అచ్చెన్న

శ్రీకాకుళం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అమలవుతున్న టెలీహెల్త్‌ సర్వీసెస్‌ను ఇక్కడా అమలు చేయాలని కేవలం నోట్‌ మాత్రమే ఇ చ్చానని మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈఎ్‌సఐలో కుంభకోణం జరిగిందన్న నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ మేరకు శుక్రవారం సందేశం పంపారు. శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామం నిమ్మాడలో తాను ఉండగా టీవీల్లో వార్తలు చూశానని.. ఈఎ్‌సఐలో భారీ కుంభకోణం జరిగిపోయిందని, మంత్రిగా తా ను సిఫారసు చేసి నామినేషన్‌పై మందుల కొనుగోలుకు లేఖ రాశానంటూ ముందుగా జగన్‌ మీడియా, తర్వాత ప్రభుత్వం పేర్కొన్నాయని చెప్పారు. మరికొన్ని టీవీల్లో ఇదే ప్రసారం చేయడంతో అసలు విషయాన్ని ప్రజలకు, పాత్రికేయులకు తెలియజేస్తున్నానని తెలిపారు. ‘నేను 2016లో కార్మిక శాఖ మంత్రిగా ఉండగా.. ప్రధాని ఈఎ్‌సఐ సమావేశం ఒకటి నిర్వహించారు. టెక్నాలజీ పెరిగిందని, టెలీహెల్త్‌ సర్వీసె్‌సను కూడా ఈఎ్‌సఐలలో అందించాలని ఆ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఆ ఏడాది డిసెంబరులో కేంద్రం నుంచి ఇదే విషయమై లేఖ వ చ్చింది. టెలీహెల్త్‌ సర్వీసెస్‌ దేశంలో ఎ క్కడ అమలవుతున్నాయని అప్పుడు నే ను అధికారులను అడగ్గా.. తెలంగాణలో అమలవుతున్నట్లు చెప్పారు. తెలంగాణ రీతిలో ఇక్కడా అమలుచేయాలని మాత్ర మే నేను నోట్‌ పంపాను. ఇదే విషయమై 2016 డిసెంబరులోనే అధికారులతో సమీక్ష నిర్వహించి.. అందులో మినిట్స్‌లో కూడా పొందుపరిచారు. మంత్రిగా ఆనాడు అది నా బాధ్యత. కానీ దానిని ఇప్పుడు భూతద్దంలో చూపిస్తున్నారు. ఫలానా వారికే మందులను నామినేషన్‌ పద్ధతిపై కేటాయించాలంటూ నేను ఎక్కడా సిఫారసు చేయలేదు. అవినీతికి పాల్పడే ఉద్దేశం, అవసరం నాకు లేదు. మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క కాగితం కూడా వృధా చేయకుండా బైండింగ్‌ కూడా చేయిం చా. ప్రస్తుతం టెలీహెల్త్‌ సర్వీసె్‌సను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం నేను స్వగ్రామంలో ఉన్నాను. రికార్డులన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి. విచారణ జరిపించుకోవచ్చు. అచ్చెన్నాయుడికి డబ్బులు అవసరమైతే పదిమందిని సహాయం కోరతాడు గానీ.. తప్పులు చేయబోడు’ అని స్పష్టంచేశారు.

Updated Date - 2020-02-22T09:49:07+05:30 IST