ఈఎ్‌సఐ వద్ద స్థల వివాదం

ABN , First Publish Date - 2021-02-25T06:55:56+05:30 IST

ఈఎ్‌సఐ విజయలక్ష్మి ఆలయం సమీపంలోని ఖాళీ స్థలం వద్ద బుధవారం వివాదం నెలకొంది. ఆ స్థలాన్ని కొంత మంది కబ్జా

ఈఎ్‌సఐ వద్ద స్థల వివాదం

 కబ్జా చేస్తున్నారని బీజేపీ నాయకుల ఆందోళన 


పంజాగుట్ట, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి):ఈఎ్‌సఐ విజయలక్ష్మి ఆలయం సమీపంలోని ఖాళీ స్థలం వద్ద బుధవారం వివాదం నెలకొంది. ఆ స్థలాన్ని కొంత మంది కబ్జా చేయాలని చూస్తున్నారని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. అది ప్రభుత్వ స్థలమని, ప్రస్తుతం న్యాయస్థానంలో ప్రైవేట్‌ వ్యక్తులతో కేసు నడుస్తోందని ఖైరతాబాద్‌ తహసీల్దార్‌ తెలిపారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలమని అందులో బోర్డు ఏర్పాటు చేశారు. ఈఎ్‌సఐ విజయలక్ష్మి ఆలయం సమీపంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ఎదురుగా ప్రధాన రహదారికి ఆనుకొని ఈ ఖాళీ స్థలం ఉంది. అందులో నారాయణ రెడ్డి అనే వ్యక్తి కొన్నేళ్లుగా కట్టెల వ్యాపారం చేస్తున్నారు. మంగళవారం రాత్రి కొంతమంది ఆ స్థలంలోని కట్టెలను ఒకవైపు జరిపి అందులో తమ కార్లను నిలిపారు. విషయం తెలుసుకున్న బీజేపీ సికింద్రాబాద్‌ జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌ సుందర్‌గౌడ్‌, మాజీ కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌, బంగారు ప్రశాంత్‌, లంకాల దీపక్‌ రెడ్డి తదితరులు అక్కడికి వెళ్లి ఆందోళనకు దిగారు. స్థలాన్ని కొంతమంది కబ్జా చేయాలని చూస్తున్నారని, స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నారాయణరెడ్డికి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-02-25T06:55:56+05:30 IST