Oct 28 2021 @ 17:55PM

షాకింగ్ నిజాలు చెప్పిన Esha Gupta.. కోరికలు తీర్చమని ఓ దర్శకుడు, ఓ నిర్మాత అడిగారంటూ..

కాస్టింగ్ కౌచ్  గురించి అప్పుడప్పుడు సినిమా ఇండస్ట్రీలోని వారు పెదవి విప్పుతూనే ఉన్నారు. మీ టూ ఉద్యమం మొదలైన తర్వాత తాము ఎదుర్కొన్న అనుభవాలను అందరూ బహిరంగంగా చెప్పడం మొదలుపెట్టారు.  తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి ఒక బాలీవుడ్ హీరోయిన్ స్పందించింది. ఒక దర్శకుడు, నిర్మాత తమ కోరికలను తీర్చమన్నారని ఆమె చెబుతోంది.   


ఇమ్రాన్ హష్మీ సరసన జన్నత్-2 సినిమాలో నటించి బాలీవుడ్‌లో కెరీర్‌ను ఆరంభించిన నటి ఇషాగుప్తా. ఈ సినిమా 2012లో విడుదలైంది.‘‘ మీరు ఎప్పుడైనా  కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నారా ’’ అని ఆమెను అడగగా తన స్పందనను తెలియజేసింది. ‘‘ ఔట్ డోర్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు ఒక దర్శకుడు తన కోరికను తీర్చమని నన్ను అడిగాడు. నేను దాని నుంచి స్మార్ట్‌గా తప్పించుకున్నాను. నాకు ఒంటరిగా నిద్రపోవడం అంటే భయం అని చెప్పాను. నా మేకప్ ఆర్టిస్టుని నాతోనే ఉండమన్నాను. బయటి నుంచి వచ్చి ఇండస్ట్రీలో పనిచేస్తున్న వారితోనే వారు ఈ విధంగా వ్యవహరిస్తారు. స్టార్ కిడ్స్‌తో ఈ విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా ప్రవర్తిస్తే వారి తల్లిదండ్రులు వచ్చి వీరిని చంపేస్తారు ’’ అని ఇషా గుప్తా చెప్పింది.


‘‘ ఒక సినిమాకు 4 నుంచి 5 రోజులు పని చేసిన తర్వాత నిర్మాత వచ్చి నేను ఈ చిత్రంలో పనిచేయడం తనకు ఇష్టం లేదన్నాడు. సినిమాకు సంబంధించిన క్రియేటివ్ ప్రొడ్యూసర్ వచ్చి ఆ విషయం నాకు చెప్పాడు. నేను నవ్వుతూ ఎందుకు నన్ను ఈ చిత్రం నుంచి తప్పిస్తున్నారని అడిగాను. నిర్మాతకు  ఇష్టం లేదని వివరించాడు. కానీ, అక్కడున్న అందరికీ ఈ విషయం తెలుసు ’’ అని ఆమె వివరించింది.  


రుస్తుం, కమాండో-2, బద్షాహో తదితర చిత్రాల్లో ఇషాగుప్తా నటించింది. సునీల్ శెట్టి సరసన ‘‘ ఇన్విజిబుల్ ఉమెన్ ’’ అనే వెబ్ సిరీస్‌లో ఆమె నటించబోతుంది.

Bollywoodమరిన్ని...