హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ చాంపియన్‌షి్‌పలో హైదరాబాదీ షూటర్ ఇషాసింగ్ మరో రెండు పతకాలను సొంతం చేసుకొంది. సోమవారం జరిగిన జూనియర్ మహిళల 25 మీటర్ల వ్యక్తిగత పిస్టల్ విభాగంలో ఇషా మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో మెరిసింది. సీనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో జాబిల్లి, నమ్యతో కలిసి ఇషా కాంస్యం సాధించింది. మొత్తంగా ఈ టోర్నీలో ఇషా 6 మెడల్స్ ఖాతాలో వేసుకోవడం విశేషం.