Abn logo
Feb 28 2021 @ 03:38AM

ఇన్వెస్కో ఈఎ‌స్‌జీ ఈక్విటీ ఫండ్‌

ఇన్వెస్కో మ్యూచువల్‌ ఫండ్‌... ‘ఇన్వెస్కో ఇండియా ఈఎ‌స్‌జీ ఈక్విటీ ఫండ్‌’పేరుతో కొత్త ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ స్కీమ్‌. ఈ ఫండ్‌ ఆఫర్‌ ఈ నెల 26న ప్రారంభం కాగా మార్చి 12న ముగుస్తుంది.  పర్యావరణం, సామాజిక, పాలనా (ఈఎ‌స్‌జీ) ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేసిన కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సాధనాల్లో పెట్టుబడి పెట్టనున్నట్టు సంస్థ పేర్కొంది. ఆస్తుల్లో అధిక శాతం లార్జ్‌ క్యాప్‌ కంపెనీల్లోనే పెట్టుబడి పెట్టనుంది. ఈ కొత్త ఫండ్‌ ఆఫర్‌లో కనీస పెట్టుబడి రూ.1,000 పెట్టాల్సి ఉంటుంది. సిప్‌ పెట్టుబడులకు కనీస మొత్తం రూ.500గా ఉంది. 

Advertisement
Advertisement
Advertisement