మార్చి 16 అనేది కువైత్‌కు చాలా స్పెషల్‌ డేగా నిలవనుంది.. ఎందుకంటే..!

ABN , First Publish Date - 2022-03-03T14:16:49+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌కు ఈ నెల 16 చాలా ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది.

మార్చి 16 అనేది కువైత్‌కు చాలా స్పెషల్‌ డేగా నిలవనుంది.. ఎందుకంటే..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌కు ఈ నెల 16 చాలా ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది. ఎందుకంటే ఆ రోజు పగలు, రాత్రి రెండు సమానంగా ఉండనున్నాయి. రెండు ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా చెరో 12 గంటలు ఉంటాయట. ఈ విషయాన్ని అల్ ఒజైరీ సైంటిఫిక్ సెంటర్‌లోని పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ ఖలీద్ అల్ జమాన్ బుధవారం వెల్లండించారు. మార్చి 16న సూర్యోదయం ఉదయం 5.57 గంటలకు అయ్యి.. సూర్యాస్తమయం సైతం సరిగ్గా సాయంత్రం 5.57 గంటలకు అవుతుందన్నారు. ఆ సమయంలో ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉంటుందని ఆయన తెలిపారు. ఈ దృగ్విషయం సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే జరుగుతుందని పేర్కొన్నారు. అందులో మొదటిది మార్చిలో, రెండవది సెప్టెంబరులో వస్తుందని జమాన్ చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-03-03T14:16:49+05:30 IST