Chennai: వర్షబాధిత ప్రాంతాల్లో ఈపీఎస్‌, ఓపీఎస్‌ పరిశీలన

ABN , First Publish Date - 2021-11-17T13:57:53+05:30 IST

భారీవర్షాల కారణంగా కడలూరు జిల్లాలో నెలకొన్న వర్షబాధిత ప్రాంతాలను మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం మంగళవారం పరిశీలించి, ప్రజలకు అన్నాడీఎంకే తరఫున స

Chennai: వర్షబాధిత ప్రాంతాల్లో ఈపీఎస్‌, ఓపీఎస్‌ పరిశీలన

ప్యారీస్‌(చెన్నై): భారీవర్షాల కారణంగా కడలూరు జిల్లాలో నెలకొన్న వర్షబాధిత ప్రాంతాలను మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం మంగళవారం పరిశీలించి, ప్రజలకు అన్నాడీఎంకే తరఫున సహాయాలు అందజేశారు. వర్షబాధిత ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలుసుకుని పంట నష్టాలను గురించి అడిగి తెలుసుకున్నారు. పలు చోట్ల నీట మునిగిన పంటలను ఇరువురూ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఇరువురూ మంగళవారం ఉదయం 9 గంటలకు భువనగిరి బస్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు కల్యాణమండపంలో పార్టీ తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సీవీ షణ్ముగం, ఎంసీ సంపత్‌, ఎమ్మెల్యే కేఏ పాండియన్‌, అరుల్‌మొళి దేవన్‌, మాజీ ఎమ్మెల్యేలు మురుగుమారన్‌, కుమరగురు, కలైసెల్వన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిదంబరంలో ముంపు ప్రాంతాలను పరిశీలించి స్థానికులకు ఈపీఎస్‌, ఓపీఎస్‌లు నిత్యావసర సరుకులు అందజేశారు.

Updated Date - 2021-11-17T13:57:53+05:30 IST