వరి మద్దతు ధరగా క్వింటాలుకు రూ.2,500 చెల్లించాలి

ABN , First Publish Date - 2021-11-11T15:24:33+05:30 IST

కనిష్ట మద్దతు ధరగా వరి క్వింటాలుకు రూ.2,500 చెల్లించాలని అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామిని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వా

వరి మద్దతు ధరగా క్వింటాలుకు రూ.2,500 చెల్లించాలి

                         - ఈపీఎస్‌, ఓపీఎస్‌ డిమాండ్‌


పెరంబూర్‌(చెన్నై): కనిష్ట మద్దతు ధరగా వరి క్వింటాలుకు రూ.2,500 చెల్లించాలని అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామిని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు బుధవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని, ఆ కేంద్రాల్లో తగిన పర్యవేక్షణ లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు వరి బస్తాలు నీటిలో తడిశాయన్నారు. డెల్టా జిల్లాల్లో మాత్రమే 40 లక్షల వరి బస్తాలు కేంద్రాల్లో బయటే ఉన్నాయని, వాటిలో వర్షాల వల్ల బస్తాల్లోని వరి మొలకెత్తిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 700 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, కొనుగోళ్ల పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన డీఎంకే 2021-22 ఆర్ధిక సంవత్సరానికి వరి కనిష్ట మద్దతు ధర ఒక క్వింటాలుకు రూ.2,015, నాణ్యమైన చెరకు టన్నుకు రూ.2,900, తక్కువ రకం చెరకు టన్నుకు రూ.2,775 మద్దతు ధర ప్రకటించిందన్నారు. ఈ మద్దతు ధరలతో రైతులు ఆర్ధికంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

Updated Date - 2021-11-11T15:24:33+05:30 IST