Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ NRI విద్యార్థులు అదుర్స్.. ఏకంగా ఆ అవార్డులనే పట్టేశారు

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరిక్ విద్యార్థులకు అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డులను సాధించారు. ఈ మేరకు యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(ఈపీఏ) తాజాగా ప్రకటించింది. ఏటా పర్యావరణ పరిక్షణ కోసం వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చిన విద్యార్థులకు ప్రెసిడెంట్స్ ఎన్విరాన్మెంటల్ యూత్ అవార్డ్(పీఈవైఏ) అవార్డులను ఈపీఏ అందిస్తుంది. ఈ క్రమంలోనే ఈ అవార్డులకు భారతీయ సంతతికి చెందిన విద్యార్థులకు ఈ అవార్డులు అందించినట్లు వెల్లడించింది.

ఆగస్టు 12న ప్రకటించిన ఈ అవార్డుల ప్రకారం.. ‘రీసైకిల్ మై బ్యాటరీ’ ప్రాజెక్టుకు గానూ శ్రీ నిహాల్ తమన్నాకు పీఈవైఏ అవార్డు దక్కింది. అలాగే ‘లేక్ బర్గా బయోడైవర్సిటీ ప్రాజెక్టు’కు గానూ సనుతి ఎన్ హెన్‌కనత్‌తెగెదరకు, మాజి - వాటర్ ఎడ్యుకేషన్ అండ్ సెక్యూరిటీ’ ప్రాజెక్టుకుగానూ హియా షా విద్యార్థికి ఈ అవార్డు దక్కింది.

దీనికి సంబంధించి ఈపీఏ అడ్మినిస్ట్రేటర్ మైకెల్ ఎస్ రీగన్ మాట్లాడుతూ.. మన దేశానికి ఈ విద్యా సంవత్సరం ఎంతో కీలకమన్నారు. దేశంలోని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా పర్యావరణాన్ని రక్షించేందుకు ఎంతగానో పాటుపడుతున్నారు. వాతావరణ మార్పులు, పర్యావరణ న్యాయం వంటి సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళుతున్నారని అన్నారు. ‘ఈ రోజు మేము విద్యార్థులు, ఉపాధ్యాయులను గౌరవిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఎంతో శ్రమపడి వారి వర్గాల్లో తీసుకొస్తున్న మార్పులు నిజంగా చాలా గొప్పవి. చేయి చేయి కలిపి పనిచేయడం ద్వారా అందరం కలిసి స్థిరమైన, ప్రశాంతమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దగలుగుతాం’ అని మైకెల్ పేర్కొన్నారు.

శ్రీ నిహాల్ తమన్నా:

న్యూ జెర్సీలోని ఎడిసన్ మిడిల్ స్కూల్‌లో చదువుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న బ్యాటరీలను రీసైకిల్ చేసుకునేందుకు అనువుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు గురించి, తెలుసుకున్న ఈపీఏ తమన్నాను పీఈవైఏ అవార్డు అందించి సత్కరించింది.

సనుతి ఎన్ హెన్‌కనత్‌తెగెదర :

వర్జీనియాలోని మిడ్లోతియన్ ప్రాంతంలో ఉన్న క్వోవర్ హిల్ ఎలిమెంటరీ స్కూల్లో గ్రేడ్-3 స్టూడెంట్ చదువుకుంటోంది. ‘లేక్ బార్గా బయోడైవర్సిటీ ప్రాజెక్ట్’ ఓ కొలనును సంరక్షించడంలో సాయం చేశారు. ద్వారా ఆల్‌బ్రైట్ రిజర్వేషన్‌లోని 568 ఎకరాల క్యాంప్ ప్రాంతంలోని మొత్తం 9 కొలనుల్లో ఇది బర్గా కొలను కూడా ఒకటి. 2020 వేసవి కాలంలో డాక్టర్ టామ్ మెక్‌కీ ఈ కొలనుకు సంబంధించి ఓ వీడియో డాక్యుమెంటరీ తయారు చేశారు. అందులో ఇక్కడి మొక్కలు, జంతువుల గురించి వివరించారు. ఈ డాక్యుమెంటరీ వీడియో తయారీలో సునుతి.. డాక్టర్ టామ్‌కు చాలా సాయం చేసింది. అంత చిన్న వయసులో ఆమె చేసిన సాయానికి గుర్తించిన ఈపీవైఏ.. పీఈవైఏ అవార్డును అందించింది.

హియా షా :

కాలిఫోర్నియాలోని ప్లిశాంటన్ స్కూల్లో గ్రేడ్-11 చదువుతున్నారు. ‘మాజీ-వాటర్ ఎడ్యుకేషన్ అండ్ సెక్యూరిటీ’ అనే ప్రాజెక్టును షా రూపొందించాడు. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలవుతుంది. ఇది సాధారణ ప్రజలతో పాటు మున్సిపాలిటీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటి కాలుష్యాన్ని నివారించేందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టును ప్రశంసించిన ఈపీవైఏ షాను పీఈవైఏ అవార్డుతో సత్కరించింది.

కాగా.. పీఈవైఏను అమెరికా పర్యావరణ విద్యా చట్టం 1970 ద్వారా ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో కే-12 యువత, చిన్నారులు చేసిన సేవలను గుర్తించి వారికి ఈ అవార్డును అందిచడం జరుగుంది. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement