పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-08-06T05:42:54+05:30 IST

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ అన్నారు. ఇక్కడి ఏఎస్పీ కార్యాలయంలో వన మహోత్సవంలో భాగంగా గురువారం మొక్కలునాటి మాట్లాడారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
నాటిన మొక్కకు నీరు పోస్తున్న ఎమ్మెల్యే గణేశ్‌, చిత్రంలో ఏఎస్పీ చందోలు

నర్సీపట్నం, ఆగస్టు 5 : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ అన్నారు. ఇక్కడి ఏఎస్పీ కార్యాలయంలో వన మహోత్సవంలో భాగంగా గురువారం మొక్కలునాటి మాట్లాడారు. నియోజవర్గంలో రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటనున్నట్టు చెప్పారు.  ఏఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ మానవ మనుగడకు అభివృద్ధి ఎంత అవసరమో, చెట్లు అంతే అవసరమన్నారు. నేషనల్‌ హైవే రోడ్ల అభివృద్ధిలో భాగంగా ఏడు కోట్లు చెట్లు నరికి వేయాల్సి వచ్చిందన్నారు. డీఎఫ్‌వో సీహెచ్‌.సూర్యనారాయణ మాట్లాడుతూ భూ భాగంలో 33 శాతం అడవులు ఉండాలని, రాష్ట్రంలో 21 శాతం మాత్రమే ఉన్నాయన్నారు. డీసీసీబీ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత, సన్యాసిపాత్రుడు మాట్లాడుతూ మొక్కల పెంపకానికి అంతా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తహసీల్దార్‌ జయ, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి, కమిషనర్‌ కనకారావు, మునిసిపల్‌ రెండో వైస్‌ చైర్మన్‌ తమరాన అప్పలనాయుడు, తధితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-06T05:42:54+05:30 IST