డిగ్రీ కళాశాలకు పర్యావరణ చాంపియన్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-05-22T06:41:11+05:30 IST

పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పర్యావరణ చాంపియన్‌ అవార్డుకు ఎంపికయ్యింది. ఈ అవార్డును మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ విద్యామండలి అందజేస్తుంది.

డిగ్రీ కళాశాలకు పర్యావరణ చాంపియన్‌ అవార్డు
జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ నుంచి ప్రశంసాపత్రాన్ని అందుకుంటున్న ప్రిన్సిపాల్‌ చిట్టబ్బాయి


 ప్రిన్సిపాల్‌ చిట్టబ్బాయిని అభినందించిన జిల్లా కలెక్టర్‌

పాడేరురూరల్‌, మే 21: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పర్యావరణ చాంపియన్‌ అవార్డుకు ఎంపికయ్యింది. ఈ అవార్డును మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ విద్యామండలి అందజేస్తుంది. స్వచ్ఛత యాక్షన్‌ ప్లాన్‌ కింద రాష్ట్రంలో ఏడు జిల్లాల్లోని కళాశాలలను ఎంపిక చేయగా.. అందులో అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి పాడేరు డిగ్రీ కళాశాల ఎంపికయ్యింది. ఈ అవార్డుకు ఎంపిక కావడంతో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ చిట్టబ్బాయి, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో జి.గౌరీశంకరరావులను జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ చిట్టబ్బాయి విలేఖర్లతో మాట్లాడుతూ.. తాను ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుధ్యం, ఆరోగ్యం, జలసంరక్షణ, శక్తి నిర్వహణ, వేస్టేజ్‌ నిర్వహణ, క్లీన్‌అండ్‌గ్రీన్‌ తదితర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం వల్లే కళాశాలకు అరుదైన గుర్తింపు లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్‌ డాక్టర్‌.టీఎన్‌.రసూల్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో జి.గౌరీశంకరరావు, అధ్యాపకులు డాక్టర్‌.వి.రమేశ్‌బాబు, ఎ.మురళీధరరావు, సూరిబాబు, కె.అప్పలనాయుడు, కొత్తంనాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T06:41:11+05:30 IST