గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , First Publish Date - 2022-07-02T06:15:39+05:30 IST

: గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం వలన ప్రజలు ఆరోగ్య వంతులుగా ఉంటారని మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి అన్నారు.

గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
చెత్త రిక్షాల ఎమ్మెల్యేలో పంపిణీ నాగార్జునరెడ్డి

ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

తర్లుపాడు, జులై 1: గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం వలన ప్రజలు ఆరోగ్య వంతులుగా ఉంటారని మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో జరిగన సమావేశంలో మండంలంలోని 16 పంచాయతీలకు మంజూరైన 42 చెత్త రిక్షాలను, ఫాగింగ్‌ మిషన్లను ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు గ్రామాల్లో చెత్తను ఎక్కడబడితే అక్కడ వేయకుండా చెత్త రిక్షాలలోనే తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇవ్వాలన్నారు. గ్రామాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్‌ మిషన్ల ద్వారా మందును పిచికారి చేయాలన్నారు. ఈ సందర్భంగా మండలంలో 1425 మందికి ఓటిఎస్‌ పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటి కలెక్టర్‌ సరళావందనం, ఎంపీపీ ఎస్‌.భూలక్ష్మీ, ఎంపీడీవో ఎస్‌.నరసింహులు, తహసీల్ధార్‌ బి.శ్రీనివాస్‌, హౌసింగ్‌ డీఈ పవన్‌కుమార్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : డెంగ్యూ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఉప వైద్యా ఆరోగ్య శాఖాధికారి డా. కె.రాహూల్‌ అన్నారు. డెంగ్యూ వ్యాధి నివారణ మహోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఇళ్లు, పరిసరాలు, పరిశుభ్రంగా ఉంచడం ద్వారానే దోమల నిర్మూలన సాద్యం అని అన్నారు. ఓవర్‌ హెడ్‌ట్యాంక్‌లు, తొట్లు, నీటి డ్రమ్ములలో ఎక్కు వ రోజులు నీరు నిల్వ చేయోద్దన్నారు. ఈ కార్య క్రమంలో సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ ఇజ్రాయిల్‌, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-02T06:15:39+05:30 IST