ఆర్జీ-2లో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం

ABN , First Publish Date - 2022-07-01T06:14:38+05:30 IST

సింగరేణి యాజమాన్యం పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్నట్టు ఆర్జీ-2 జీఎం వెంకటేశ్వరరావు పేర్కొ న్నారు.

ఆర్జీ-2లో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం
విజేతలకు బహుమతులు అందజేస్తున్న జీఎం

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 30: సింగరేణి యాజమాన్యం పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్నట్టు ఆర్జీ-2 జీఎం వెంకటేశ్వరరావు పేర్కొ న్నారు. గురువారం జీఎం కార్యాలయంలో నిర్వహించిన పర్యావరణ పరి రక్షణ దినోత్సవానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి ఏటా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఏరియాలో నిర్వహిస్తూ లక్షలాది మొక్కలు నాటుతున్నట్టు జీఎం తెలిపారు. మనం నివసిస్తున్న భూమిని పరిశుభ్రంగా ఉంచుతూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని జీఎం పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులతో పర్యావర ణ ప్రతిజ్ఞ చేయించారు. జూన్‌ 16 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛ తా పక్వాడలో భాగంగా నిర్వహించిన క్విజ్‌ పోటీల విజేతలకు బహు మతులు అందజేశారు. ఈకార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఏరియా వైస్‌ ప్రెసి డెంట్‌ అయిలి శ్రీనివాస్‌, అధికారుల సంఘం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఎస్వోటూ జీఎం సాంబయ్య, పర్యావరణ అధికారి రాజారెడ్డి, అధికారులు రాజేంద్రప్రసాద్‌, మురళీకృష్ణ, అనిల్‌కుమార్‌, చంద్రమౌళిలతో పాటు జీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T06:14:38+05:30 IST