వరంగల్‌ మార్కెట్‌కు 4 రోజులు సెలవులు

ABN , First Publish Date - 2022-08-11T06:06:25+05:30 IST

వరంగల్‌ మార్కెట్‌కు 4 రోజులు సెలవులు

వరంగల్‌ మార్కెట్‌కు 4 రోజులు సెలవులు

వరంగల్‌టౌన్‌, ఆగస్టు 10: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ దిడ్డి భాగ్యలక్ష్మి బుధవారం త్రెలిపారు. శుక్రవారం రాఖీ పండగ, శనివారం యార్డు బంద్‌, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. మంగళవారం నుంచి మార్కెట్‌ యార్డులో యథావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు మార్కెట్‌ కమిటీకి సహకరించాలని కోరారు.  


Updated Date - 2022-08-11T06:06:25+05:30 IST