ఎంతకు అంతే దక్కుతుంది!

ABN , First Publish Date - 2020-07-31T04:54:03+05:30 IST

మనం ఎంత ప్రయత్నం చేసినా ఒక్కోసారి మనకు రావలసిందే వస్తుంది.

ఎంతకు అంతే దక్కుతుంది!

మనం ఎంత ప్రయత్నం చేసినా ఒక్కోసారి మనకు రావలసిందే వస్తుంది. ఎక్కువా రాదు, తక్కువా రాదు. ఆ విషయాన్ని భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి పద్యం ద్వారా తెలుసుకుందాం!


ఎవ్వనికి నిజ్జగంబున నెంత ఫలము

దైవకృతమగునది వొందు దప్పకతని

గారణము గాదు పెనుబ్రాపు ఘనుని జేరు

చాతకము వాతబడు నల్పజలకణములు


ఎంత ప్రయత్నం చేసినా మనకు రావలసిందే వస్తుంది. అదనంగా రాదు. కృషి చేయి. ఫలితం వస్తే సంతోషం. రాకపోతే ఇలా అనుకోండి! అప్పుడు మనసు తేలికపడుతుంది. ఇందుకు మంచి ఉదాహరణ ఇది. ఒక అడవిలో జోరున వర్షం కురుస్తోంది. చాతక పిట్ట ఆ చెట్టు కొమ్మ చివరకు వచ్చి నోరు తెరిచి పెట్టింది. దాని నోట్లో పడిన ఒకటి రెండు బొట్లే దానికి దక్కాయి. లోకంలో నీకు ఎంత రాసి పెట్టి ఉందో అంతే దొరుకుతుంది. ఎంత కష్టపడ్డావో అంతే ఫలితం వస్తుంది. - గరికిపాటి నరసింహారావు



Updated Date - 2020-07-31T04:54:03+05:30 IST