అరుణ్ విజయ్ (Arun Vijay), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) జంటగా.. సముద్రఖని (Samudrakhani), KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్ (Radhika Satrathkumar), యోగి బాబు, ఇతర కీలక పాత్రల్లో రూపొందిన తాజా చిత్రం 'ఏనుగు' (Enugu). శ్రీమతి జగన్మోహని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై హరి దర్శకత్వంలో సీహెచ్ సతీష్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 1 న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ...సింగం సిరీస్, పూజ సినిమాలతో కమర్షియల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరి నెక్స్ట్ సినిమా 'ఏనుగు'. హరితో కలసి మేము మంచి కంటెంట్ ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యలని ఎంటర్టైన్మెంట్ రూపంలో ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. తెలుగులో దర్శకుడు హరి చేసిన గత సినిమాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో ఇప్పుడు వస్తున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఏనుగు' చిత్రం కూడా అంతే పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. జులై 1 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను తెలుగు తమిళ్ లో ఒకే సారి రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. అలాగే, ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతారని ఖచ్చితంగా నమ్ముతున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు హరి మాట్లాడుతూ...మంచి కంటెంట్ తో వస్తున్న "ఏనుగు" సినిమా నాకు 16వది. ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఇందులో చూయించడం జరిగింది. అలాగే ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ ఇలా ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఫ్యామిలీ తో వచ్చి చూసే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఇంతకుముందు నేను చేసిన చిత్రాలను ఆదరించి నట్లే ఇప్పుడు మంచి కంటెంట్ తో జులై 1 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను'.. అన్నారు.