ఈ ఒక్క మిస్టేక్ చేస్తే.. America లోకి అడుగు పెట్టలేరు.. మనోళ్లు వాటిని అసలు పట్టించుకోరు కానీ..

ABN , First Publish Date - 2022-05-14T02:22:20+05:30 IST

అమెరికాకు వెళ్లే భారతీయులు సాధారణంగా ఓ పెద్ద మిస్టేక్ చేస్తుంటారు. మందులతో పాటూ వైద్యుడు రాసిన మందుల చీటీ కూడా తీసుకెళ్లాలన్న నిబంధనను పట్టించుకోరు. కానీ.. టైం బాలేకపోతే మాత్రం పరిస్థితి చేయి దాటి పోతుంది. చేతిలో వైద్యుడు రాసిచ్చిన మందుల చీటీ లేకపోతే.. ఎయిర్‌పోర్టు అధికారులు మందులను జప్తు చేస్తారు.

ఈ ఒక్క మిస్టేక్ చేస్తే.. America లోకి అడుగు పెట్టలేరు.. మనోళ్లు వాటిని అసలు పట్టించుకోరు కానీ..

ఎన్నారై డెస్క్: అమెరికాకు వెళ్లే అనేక మంది భారతీయులు తమ వెంట మందులు తీసుకెళతారన్న విషయం తెలిసిందే. సాధారణంగా మనవాళ్లు భారీ మొత్తంలో మందులు తీసుకెళుతుంటారు. వీటితో ఓ చిన్న మెడికల్ షాపు పెట్టుకోవచ్చనేంత స్థాయిలో ఉంటుందీ వ్యవహారం. అయితే.. దీని వెనుక రెండు ప్రధాన కారణాలున్నాయి. వాటిల్లో మొదటిది.. మందుల ధరలు! అమెరికాలో ఔషధాల ధరలు మనం భరించలేం. అక్కడి ధరలతో పోలిస్తే.. ఇండియాలో మందులు చాలా చవక. ఇక రెండోది డాక్టర్ ప్రిస్కిప్షన్. అమెరికా మందుల షాపుల్లో వైద్యుడు రాసిన మందుల చీటీ లేకుండా ఔషధాలు కొనుగోలు చేయడం అసాధ్యం. ఈ విషయంలో అక్కడి డిస్పెన్సరీలు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. కాబట్టే.. భారతీయులు మందుల విషయంలో ఇలా ముందు జాగ్రత్త పడుతుంటారు. 

 

అయితే.. ఇంత జాగ్రత్తపరులు కూడా అమెరికా నిబంధనల విషయంలో ఓ పెద్ద మిస్టేక్ చేస్తుంటారు. మందులతో పాటూ వైద్యుడు రాసిన మందుల చీటీ కూడా తీసుకెళ్లాలన్న నిబంధనను పట్టించుకోరు. అమెరికా ఎయిర్‌పోర్టుల్లో మందులను ఎవరూ తనిఖీ చేయరనుకుంటూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. కానీ.. టైం బాలేకపోతే మాత్రం పరిస్థితి చేయి దాటి పోతుంది. చేతిలో వైద్యుడు రాసిచ్చిన మందుల చీటీ లేకపోతే..  ఎయిర్‌పోర్టు అధికారులు మందులను జప్తు చేస్తారు. ఈ విషయంలో అక్కడి అధికారులు నిబంధనలను పక్కాగా పాటిస్తారు.  మరి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? మందుల విషయంలో అమెరికా నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓ మారు చూద్దాం.. 


చిక్కులు వద్దనుకుంటే ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

  1. మందులతో పాటూ మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా కచ్చితంగా వెంట తీసుకెళ్లాలి. 
  2. మందులు ఉన్న కంటెయినర్‌పై డాక్టర్ రాసిన సూచనలు ఉండాలి. 
  3. విదేశాల్లో ఎంత కాలం ఉంటారో అందుకు సరిపడా మాత్రమే మందులను తీసుకెళ్లాలి. 
  4. ఘన, ద్రవరూంలో ఉన్న మందులను చేతికి తగిలించుకునే క్యారీ బ్యాగుల్లో విమానంలోకి తీసుకెళ్లవచ్చు. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఆయా దేశాలను బట్టి మారుతుంటాయి. 
  5. సిరంజ్‌లు, ఐవీ బ్యాగులు, పంప్స్, ఫ్రీజర్ ప్యాకులను కూడా ప్రయాణికులు విమానంలోకి తీసుకెళ్లవచ్చు. అయితే.. వాటిపై లేబుల్స్ స్పష్టంగా ఉండాలి.   


Read more