గోవా కల్చర్‌ను అడ్డంగా హైదరాబాద్‌లో దింపేయాలి.. ఇదే అభిషేక్ స్కెచ్

ABN , First Publish Date - 2022-04-15T23:02:39+05:30 IST

గోవా కల్చర్‌ను అడ్డంగా హైదరాబాద్‌లో దింపేయాలి.. ఇదే అభిషేక్ స్కెచ్

గోవా కల్చర్‌ను అడ్డంగా హైదరాబాద్‌లో దింపేయాలి.. ఇదే అభిషేక్ స్కెచ్

హైదరాబాద్: హైదరాబాద్ లో ఉండే  ప్రముఖుల కంటూ ఓ పబ్ ఉండాలి. రౌండ్ ది క్లాక్ ఆ పబ్ ఓపెన్ లో ఉండాలి..  ఆ పబ్ వారి ప్రయివసికి  వందకు వంద శాతం గ్యారెంటీ ఇవ్వాలి... నషాళానికి మత్తు ఎక్కేదాకా. ఒళ్ళు మరిచి మత్తులో తేలేదాక తాగి తూగే వెసులుబాటు ఆ పబ్బులో  కల్పించాలి... మందంటే మందు. మగువ అంటే మగువ.. అది సరిపోకపోతే డ్రగ్స్ కూడా ఎంచక్కా అక్కడే దొరికేయలి..  మొత్తంగా గోవా కల్చర్ ను అడ్డంగా హైదరాబాద్లో దింపేయాలి ఇదే అభిషేక్ స్కెచ్.. అభిషేక్ ఆలోచనల రూపమే ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్... అసలు ఈ స్కెచ్ కు  బీజం ఎక్కడ పడింది... పుదింగ్ పబ్ లో ప్రముఖులకు మాత్రం ఎంట్రీ ఇచ్చి ఇతరులకు నో ఎంట్రీ బోర్డ్ పెట్టడం  వెనుకున్న ఆంతర్యం ఏంటి. . అభిషేక్ కేవలం డ్రగ్స్ సప్లై తోనే ఆగిపోయాడా లేక శృంగార క్రీడలకు తెరలేపాడ...?? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏబీఎన్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ లో మీకోసం....


టాలీవుడ్ డ్రగ్స్ కేసు తర్వాత అంతటి ప్రచారం, ప్రాచుర్యం, ప్రాధాన్యత సంతరించుకున్న కేసు పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు.  పూటుగా తాగి  డీజే డ్యాన్సులతో ఒళ్ళు మరిచి  చిందులు వేస్తున్న సమయంలో  టాస్క్ ఫోర్స్ పోలీసుల సడెన్ ఎంట్రీ పబ్ లో ఉన్న వారికీ చెమటలు పట్టించింది.. అదే సమయంలో  పబ్ లో డ్రగ్స్ దొరకడం పెను సంచలనంగా మారింది.. దొరికిన డ్రగ్స్  దెబ్బకు  నూట యాభై మందికి   పోలీస్ స్టేషన్  మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇందులో ఎవరు డ్రగ్స్  తీసుకున్నారు ఎవరు తీసుకోలేదు అన్న విషయం పక్కన  పెడితే   పోలీసులు జీపు ఎక్కించిన వారిలో బడా బాబులు, బ్యూరో క్రాట్స్, సినిమా సెలెబ్రిటీస్ కూడా ఉండటంతో ఈ కేసు ఇంకాస్త ఇంట్రస్టింగ్ మారింది.. మత్తు వదిలాక వివరాలు తీసుకుని పోలీసులు వారిని ఇళ్లకు పంపించేశారు.


పుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ దొరకడంతో ఓనర్ అభిశేక్ అలానే మేనేజర్ శ్రీనివాస్ కు సంకెళ్లు వేసిన  పోలీసులు వారిని   రిమాండ్  కు తరలించారు. అనంతరం కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఇదంతా పక్కన పెడితే ఈ పబ్  అండ్ డ్రగ్స్ వ్యవహారాన్ని పక్కాగా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసింది మాత్రం అభిషేక్ అని తేలింది. అతనికి మేనేజర్ శ్రీనివాస్ సహకారం అందించినట్లు సుస్పష్టమైంది. పబ్ లో ఈ డ్రగ్స్ గుట్టు బయట పడ్డాకా వందలాది ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి .  అసలు అభిషేక్ కు హైదరాబాద్ లో పబ్ రన్ చేద్దాం అనే ఆలోచనా ఎలా వచ్చింది...  పబ్ నిర్వహణకు ర్యాడిసన్ హోటల్ నే ఎందుకు ఎంచుకున్నట్టు, పబ్ లో ఎలాంటి నీచ కార్యాలకు తావు లేకపోతే  మూడంచెల భద్రతా ఎందుకు ఇస్తున్నట్టు ఇలా ఒకటి కాదు రెండు అన్ని సమాధానాలు లేని ప్రశ్నలే.. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఏబీఎన్ క్రైం టీం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో కళ్ళు చెదిరే నిజాలు వెలుగులోకి వచ్చాయి.


హైదరాబాద్ నుండి గోవాకు చిల్ అవ్వడానికి వస్తున్న సెలబ్రిటీలు ప్రముఖులను చూసిన అభిషేక్ అందుకు  గల కారణాలను విశ్లేంచుకున్నాడు.. హైదరాబాద్ లో పబ్బులు లేవా.. ఉంటే ఆ పబ్బులు ఎందుకు ప్రముఖులను ఆకర్షించలేక పోతున్నాయి.. గోవా పబ్బుల్లో ఉన్నదేంటి హైదరాబాద్ లోని పబ్బుల్లో లేనిది ఏంటి.. ఎందుకు వీళ్లంతా గోవాకు క్యూ కడుతున్నారు ఆన్న లెక్కలు వేసుకున్నడు అభిషేక్.. నగరంలోని పబ్బుల్లో ప్రముఖులకు కావాల్సిన సెక్యూరిటీ, ప్రయివసి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏవి లేకపోవడం వల్లనే సెలబ్రిటీలు గోవాకు క్యూ కడుతున్నట్టు కంక్లూజన్ వచ్చిన అభిషేక్ అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని టాప్ సెక్యూరిటీ తో వారి ప్రయివసి మొదటి ప్రాధాన్యం ఇచ్చే పబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాడు . సరిగ్గా మూడు సంవత్సరాల క్రితమే ప్లాన్ చేసుకున్నాడు.


వాస్తవానికి  గోవా పబ్  కల్చర్ ను అభిషేక్ దగ్గరుండి చూసాడు. గోవాలోని  ఓ పబ్   నిర్వహించాడు కూడా. హైదరాబాద్ లో పబ్ ఏర్పాటు చేయాలి ఆన్న ఆలోచన పురుడు పోసుకున క్షణం నుండే ఈ అంశంపై సీరియస్ గా వర్క్ చేశాడు అభిషేక్..   ఈ సమయంలో హైదరాబాద్ నుండి గోవాకు వస్తోన్న ప్రముఖుల డేటా తయారు చేసుకున్నాడు. హైదరాబాద్ లో పబ్ ఏర్పాటు చేయడానికి సరైన వేదిక కోసం చూసాడు. ఆ సమయంలోనే అతని కన్ను  ర్యాడిసన్ లో హోటల్ లోని  పుడింగ్ అండ్ మింక్ పబ్ పై పడింది. అతని ఆలోచనలకు కార్యరూపం  ఇవ్వడానికి  పుడింగ్ పబ్ అయితేనే ది బెస్ట్ ప్లేస్ అనుకున్న అభిషేక్  ఆ పబ్ ను లీజ్ కు తీసుకున్నాడు. అనంతరం ఇరవై నాలుగు గంటలు బార్ ఓపెన్ చేసి ఉండేలా లైసెన్స్ సంపాదించాడు.. పబ్ కు అదనపు హంగులు  అద్ది జనవరి న పబ్ ఓపెన్ చేసాడు.  అంతకు ముందే తనకు పరిచయం ఉన్న శ్రీనివాస్ ను పబ్ మేనేజర్ గా నియమించుకున్నాడు.


పబ్ అయితే ఏర్పాటు చేశాడు దాన్ని సక్సెస్ ఫుల్ గా రన్ చేయాలి.. కస్టమర్లను ఆకర్షించాలి.. ఒక్కసారి వచ్చిన కస్టమర్ పర్మనెంట్ కస్టమర్ అయిపోవాలి.. అందుకు ఏం చేయాలి ఆన్న ఆలోచన చేసిన అభిషేక్ ప్రముఖులకు ప్రముఖుల పిల్లలకు సెలేబ్రిటీలకు మోడల్స్ ను ఎరగా వేశాడు . పబ్ లో టాప్ సెక్యూరిటీ ఉంటుందని నమ్మించాడు . మద్యంతో పాటు మగువను పిక్ చేసుకునే అవకాశం కూడా ఉందంటూ ఊరించాడు..  పుడింగ్ పబ్ గోవా పబ్ కు జిరాక్స్ కాపీ లాంటిది అని విస్పృత ప్రచారం కల్పించడంతో  అనతి కాలంలోనే పబ్ లో సందడి మొదలయింది..  మరోవైపు పబ్ లో డ్రగ్స్ కూడా అందుబాటులో ఉంచడంతో  పబ్ కు వచ్చే సెలబ్రిటీలు, ప్రముఖుల సంఖ్య పెరుగుతూ వచ్చినట్టు సమాచారం..  అభిషేక్ కస్టమర్ల ఎంపికలో కూడా సాదాసీదాగా వ్యవహరించలేదు.. తన కస్టమర్లలో సింహభాగం బ్యూరో క్రాట్స్, పొలిటీషియన్స్, ప్రముఖుల పిల్లలే  ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.. వీళ్ళనే టార్గెట్ చేసుకోవడానికి గల కారణాలు కూడా లేకపోలేదు.. భవిష్యత్ లో ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే తనతో పాటు ప్రముఖుల పిల్లలు కూడా ఇరుక్కుంటారు.. సో తల్లిదండ్రులు ఎలాగో వారిని తప్పించే ప్రయత్నం చేసినపుడు వారితో పాటు తాను కూడా ఈజీగా బయట పడొచ్చనే భావన తోనే ప్రముఖులను మాత్రమే తన కస్టమర్లుగా అభిషేక్ మర్చుకునట్టు తెలిసింది.


అభిషేక్ గోవా పబ్ కల్చర్ ను అడ్డంగా హైదరాబాద్ లో దింపేసాడు... పుడింగ్ అండ్ మింక్ పబ్బుల్లో కేవలం మందు చిందు మాత్రమే కాకుండా మోడల్స్ చేత వ్యభిచారం చేయించినట్లు సమాచారం..  గోవాలో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి . అదే కల్చర్ ను హైదరాబాద్ లోని మింక్ పబ్బ్బుకి తీసుకువచ్చాడు అభిషేక్.. పబ్ కి వచ్చేవారికి అమ్మాయిల పొందు కావాలి అనుకుంటే ఆ క్షణం వారు అడిగింది సమకూర్చడం కోసం ర్యాడిసన్ హోటల్ ప్రత్యేకంగా కొన్ని గదులను కూడా రిజర్వ్ చేసుకున్నట్టు సమాచారం...  పబ్ సెక్యూరిటీ విషయంలో కూడా అభిషేక్ చాలా తెలివిగా వ్యవహరించాడు . పబ్ కు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసుకున్నాడు. కండలు తిరిగిన బౌన్సర్లను నియమించుకున్నాడు.. పటిష్ఠమైన నిఘా వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.. చీమ చిటుక్కుమన్నా తనకు వెంటనే తెలిసేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు.. పబ్ కు ప్రముఖుల ఎంట్రీ ప్రత్యేక యాప్ రూపొందించాడు..అందులో రిజిస్టర్ చేసుకుని మనీ కట్టిన వారికి ఓటిపి వస్తుంది.. అలా ఓటిపి వచ్చిన వారికి మాత్రమే పబ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించాడు..  ఇంత పటిష్ఠమైన భద్రత అన్ని సౌకర్యాలు పుడింగ్ అండ్ మింక్ పబ్ లో లభిస్తూ ఉండటంతో ప్రముఖుల పిల్ల ఫస్ట్  ఆప్షన్ గా పుడింగ్ అండ్ మింక్ పబ్ మారింది.


అభిషేక్ ఈ పబ్ ను డీజే డ్యాన్స్ ఫ్లోర్ కే పరిమితం చేయలేదు.. పబ్ కు వచ్చే వారికి అదనపు కిక్ ఇవ్వాలని భావించాడు. అందులో భాగంగానే మేనేజర్ అనిల్ సహకారంతో పబ్ లో కాష్లి పార్టీలను ఆరెంజ్ చేశాడు.. ఈ పార్టీలకు ఆహుతులను అభిషేక్ అవానిచేవడు.. ఈ పార్టీలకు నగరంలో సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు తో పాటు బ్యూరోక్రాట్స్ కూడా హాజరయ్యారన్న పక్కా సమాచారం పోలీసుల తో ఉంది. పార్టీలకు వచ్చిన ఆహూతులకు అభిషేక్ డ్రగ్స్ సప్లై చేసినట్టు నిర్ధారణ అయింది.. అయితే ఈ డ్రగ్స్ అభిషేక్ చేతికి ఎలా వస్తున్నాయి.. ఎంతకాలంగా అభిషేక్ ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు ఆన్న విషయాలపై క్లారిటీ రావాలి.


అభిషేక్ మొబైల్ ను సిజ్ చేసిన పోలీసులు అందులో గోవాకు చెందిన డ్రగ్స్ ఫెడ్లర్ల నంబర్ల గుర్తించారు.. అంటే డ్రగ్స్ ఫెడ్లర్లతో అభిషేక్ కు సంబంధాలు ఉన్నాయన్నది సుస్పష్టం . అయితే ఈ డ్రగ్స్ ను హైదరబాద్ కు తీసుకురావడంలో చాలా తెలివిగా వ్యవహరించాడు.. ఎవరికీ అనుమానం రాకుండా గోవా నుండి హైదరాబాద్ వచ్చే మోడల్స్ అమ్మాయిల చేత  రహస్యంగా ఈ డ్రగ్స్ తెప్పించినట్టు సమాచారం.. నగరంలో తాను నిర్వహిస్తోన్న పబ్ కు గోవాకు చెందిన మోడల్స్ అలానే యువతులు వస్తుంటారు.. ఇక్కడి పబ్ కు వచ్చే వారి కోరిక మేరకు అభిషేక్ గోవా నుండి మోడల్స్ ను నగరానికిరప్పించే వాడని సమాచారం.. అల వస్తూ వస్తూ వారి చేతనే ఈ డ్రగ్స్ నగరానికి తెప్పించినట్టు సమాచారం ఉంది.


అభిషేక్ ఈ పబ్ ద్వారా కళ్ళు చెదిరే ఆదాయాన్ని పొందగలిగాడు.. నెలకు సుమారు మూడున్నర కోట్ల దాకా అర్జించాడు.. ఇలా వచ్చిన డబ్బు నుండి కొంత మంది పోలీసు అధికారులకు మామూళ్లు ముఠా చెప్పాడు. నెల తిరిగే సరికి.తమకు రావాల్సిన మామూళ్లు వస్తూ ఉండటంతో పోలీసుల కూడా కళ్ళకు గంతలు కట్టుకున్నారు .. అతి తక్కువ కాలంలోనే పబ్బును వృద్ధిలోకి తెచ్చుకున్నా అభిషేక్ కు అతని పోగరే అతన్ని దెబ్బ తీసిందా.. ఆ పొగరు వల్ల ఈ డ్రగ్స్ వ్యవహారం బయట పడిందా అంటే అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి... ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పబ్ కు కొంతమంది బ్యూరో క్రాట్స్ కూడా వచ్చారు. అందులో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాిదికారులు ఉన్నారు... ఈ పబ్ కు రెగ్యులర్ కస్టమర్ అయిన ఓ అధికారికి స్టార్టింగ్ టాప్ ప్రియారిటి లభించింది. రాను రాను ఆ ప్రీయారిటి తగ్గడంతో పాటు ఆ అధికారితో అభిషేక్ పొగరుగా మాట్లాడినట్టు తెలిసింది.. అభిషేక్ మాటల్తో హార్ట్ అయిన అధికారి పబ్ లో జరుగుతున్న ఈ తంతంగాన్ని పోలీసులకు వివరించి నట్టు తెలిసింది.. దీంతో ఆ అధికారి ఇచ్చిన సమాచారం తోనే డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు పబ్ మాటున  అభిషేక్ నడుపుతున్న చీకటి బాగోతాన్ని బట్ట బయలు చేశారు.


ర్యాడిసన్ హోటల్ లో అభిషేక్ చీకటి వ్యాపారాలు నడిపాడు.. ఒకరకంగా హోటల్ ను వ్యభిచార కూపంగా మార్చడనడానికి పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి.. ప్రస్తుతం కేవలం డ్రగ్స్ అంశంపై మాత్రమే విచారణ చేపట్టిన పోలీసులు  మిగతా కోణాలపై దృష్టి సారించలేదు.. మొత్తానికి అభిషేక్ పాపం పండి పోలీసులకు చిక్కాడు. లేదంటే ఇంకా విచ్చల విడి పార్టీలు, పార్టీలో డ్రగ్స్ వాడకం పెచ్చు మీరేది... ప్రస్తుతం కస్టడీ విచారణ ఎదుర్కుంటున్న అభిషేక్ అనిల్ పోలీసుల ప్రశ్నలకు మౌనమే సమాధానంగా ఉంటున్నారు..ఇద్దరు నోరు విప్పితే ఈ డ్రగ్స్ వ్యవహరం లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.. సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా విచారణ ఎదుర్కునే అవకాశం ఉంది..

Updated Date - 2022-04-15T23:02:39+05:30 IST