Abn logo
Sep 26 2021 @ 00:30AM

పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు

అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు 

సూర్యాపేట(కలెక్టరేట్‌), సెప్టెంబరు 25: జిల్లాలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకువచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధం గా అధికారులు పని చేయాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నా రు. ఆజాద్‌కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్య క్రమాలు నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులను నిర్ణీతసమయంలో పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమలశాఖ జీఎం తి రుపతయ్య, పన్నుల అధికారి విజయ్‌సాగర్‌, డీఏవో రామారావునాయక్‌, జిల్లా పశుసంవర్థకశాఖఅధికారి శ్రీనివాస్‌రావు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.