Abn logo
Jul 13 2020 @ 09:36AM

బిగ్‌బీ ఫొటో షేర్ చేసిన రెజ్ల‌ర్ జాన్ సెనా

అంతర్జాతీయ రెజ్లర్ జాన్ సెనా ప‌లు హాలీవుడ్ చిత్రాలలో న‌టించారు. తాజాగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఫోటోను షేర్ చేశారు. అయితే ఈ ఫోటోకు సంబంధించి జాన్ సెనా ఎటువంటి క్యాప్షన్ రాయలేదు. ఈ ఫోటోలో సాంప్రదాయ దుస్తులలో అమితాబ్ బచ్చన్ కనిపించగా, అభిషేక్ బచ్చన్ సూట్ ధరించి ఉన్నారు. జాన్ సెనా తరచూ బాలీవుడ్ ప్రముఖుల ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అమితాబ్ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్ కరోనా పాజిటివ్ అని తేలిన తరువాత వీరిద్ద‌రూ ఆసుపత్రిలో చేరారు. తరువాత ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ కూడా కోవిడ్ -19 పాజిటివ్ అని వెల్ల‌డ‌య్యింది. దీంతో వీరిద్ద‌రూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement