అలరించిన సినీ సంగీత విభావరి

ABN , First Publish Date - 2021-04-11T05:26:56+05:30 IST

స్థానిక గురజాడ కళాభారతిలో ఘంటసాల కళాపీఠం ఆధ్వ ర్యంలో శనివారం నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా అల రించింది

అలరించిన సినీ సంగీత విభావరి
సంగీత విభావరిలో ఆలపిస్తున్న గాయకులు

బాబామెట్ట : స్థానిక గురజాడ కళాభారతిలో ఘంటసాల కళాపీఠం ఆధ్వ ర్యంలో శనివారం నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా అల రించింది. సంగీత దర్శకుడు, సంస్థ వ్యవస్థాపకుడు ఎంం.భీష్మారావు  ఆధ్వ ర్యంలో జిల్లాకు చెందిన పలువురు వర్దమాన గాయకులు నాటి మధుర గీతాలు ఆలపించి అందర్నీ ఆకట్టుకున్నారు.  గాయకులు ఘంటసాల, ఎస్పీ బాలు,  ఎస్‌. జానకి, పి.సుశీల పాడిన సినీ గీతాలను ఆలపించి శ్రోతలను ఉత్సాహపరిచారు.    సాయి, పవన్‌లు వాయిద్య సహకారం అందించగా, ఉమాశంకర్‌, డాక్టర్‌ శ్రీని వాస్‌, గుప్త, అరుణకుమారి, శ్రీవల్లి, జయంతి తదితరులు గీతాలు ఆలపించారు. 

 

Updated Date - 2021-04-11T05:26:56+05:30 IST