కృత్రిమ అవయవాలకు పేర్లు నమోదు చేసుకోండి

ABN , First Publish Date - 2022-05-19T05:13:53+05:30 IST

భారత వికాస్‌ పరిషత (బీవీపీ) కర్నూలు నగర శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా నాణ్యమైన కృత్రిమ కాళ్లు, చేతులు (కాలిపర్స్‌) అందజేస్తున్నామని, ఇవి అవసరమైన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని బీవీపీ కన్వీనర్‌ రేగూరు బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

కృత్రిమ అవయవాలకు పేర్లు నమోదు చేసుకోండి


కర్నూలు (కల్చరల్‌), మే 18: భారత వికాస్‌ పరిషత (బీవీపీ) కర్నూలు నగర శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా నాణ్యమైన కృత్రిమ కాళ్లు, చేతులు (కాలిపర్స్‌) అందజేస్తున్నామని, ఇవి  అవసరమైన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని బీవీపీ కన్వీనర్‌ రేగూరు బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. బీవీపీ నిర్వహిస్తోన్న జాతీయ శాశ్వత పథకమైన పునరావాస యోజన కార్యక్రమంలో   దివ్యాంగులకు కాలిపర్స్‌ అందజేస్తున్నామని తెలిపారు. 29లోగా తమ పేర్లు, వివరాలను రేగూరు బాలకృష్ణ, కన్వీనర్‌, 8142550143, లేదా గుండా అమర్‌నాథ్‌, కార్యదర్శి 9703444657లలో నమోదు చేసుకోవాలని సూచించారు.  


Updated Date - 2022-05-19T05:13:53+05:30 IST