CDACలో పీజీ డిప్లొమా కోర్సులు

ABN , First Publish Date - 2022-07-01T21:26:23+05:30 IST

సెంటర్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(Center for Development of Advanced Computing) (సి-డాక్‌) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా(Post‌ Graduate Diploma) కోర్సుల్లో ప్రవేశానికి

CDACలో పీజీ డిప్లొమా కోర్సులు

సెంటర్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(Center for Development of Advanced Computing) (సి-డాక్‌) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా(Post‌ Graduate Diploma) కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఒక్కో కోర్సు వ్యవధి 26 వారాలు. సంస్థకు చెందిన ట్రెయినింగ్‌ సెంటర్‌లు నిర్దేశించిన మేరకు కోర్సులను ఆన్‌లైన్‌, ఫిజికల్‌ మోడ్‌ విధానాల్లో నిర్వహిస్తారు. ఇవి ఫుల్‌ టైం కోర్సులు. వీటిలో థియరీ సెషన్స్‌, ల్యాబ్‌ సెషన్స్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌లు ఉంటాయి. వీటిని సి-డాక్‌, ఐసీటీ సంస్థలకు చెందిన నిపుణులు నిర్వహిస్తారు. ఆప్టిట్యూడ్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ ఇంటర్వ్యూ స్కిల్స్‌ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఉంటుంది. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ సౌకర్యం ఉంది. 


కోర్సులు

  • పీజీ డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(పీజీ - డీఏసీ) 
  • పీజీ డిప్లొమా ఇన్‌ బిగ్‌ డేటా అనలిటిక్స్‌(పీజీ - డీబీడీఏ)
  • పీజీ డిప్లొమా ఇన్‌ ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ డిజైన్‌(పీజీ - డీఈఎ్‌సడీ)
  • పీజీ డిప్లొమా ఇన్‌ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సిస్టమ్స్‌ అండ్‌ సెక్యూరిటీ (పీజీ - డీఐటీఐఎస్‌ఎస్‌)
  • పీజీ డిప్లొమా ఇన్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(పీజీ - డీఏఐ)
  • పీజీ డిప్లొమా ఇన్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(పీజీ - డీఐఓటీ)
  • పీజీ డిప్లొమా ఇన్‌ వీఎల్‌ఎ్‌సఐ డిజైన్‌(పీజీ - డీవీఎల్‌ఎస్‌ఐ)
  • పీజీ డిప్లొమా ఇన్‌ మొబైల్‌ కంప్యూటింగ్‌(పీజీ - డీఎంసీ)
  • పీజీ డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ సెక్యూర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ (పీజీ - డీఏఎస్‌‌ఎస్‌డీ)
  • పీజీ డిప్లొమా ఇన్‌ జియోఇన్ఫర్మాటిక్స్‌ (పీజీ - డీజీఐ)
  • పీజీ డిప్లొమా ఇన్‌ రోబోటిక్స్‌ అండ్‌ అలయిడ్‌ టెక్నాలజీస్‌( పీజీ - డీఆర్‌ఏటీ)
  • పీజీ డిప్లొమా ఇన్‌ హెచ్‌పీసీ సిస్టం అడ్మినిస్ట్రేషన్‌(పీజీ - డీహెచ్‌పీసీఎస్‌ఏ)
  • పీజీ డిప్లొమా ఇన్‌ ఫిన్‌టెక్‌ అండ్‌ బ్లాక్‌ చెయిన్‌ డెవల్‌పమెంట్‌ (పీజీ - డీఎఫ్‌బీడీ) 
  • పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఫోరెన్సిక్స్‌(పీజీ - డీసీఎస్‌ఎఫ్‌)

ట్రెయినింగ్‌ సెంటర్‌లు: హైదరాబాద్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, చెన్నై, ఇండోర్‌, జైపూర్‌, కరాడ్‌, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్‌, నాసిక్‌, న్యూఢిల్లీ, నోయిడా, పట్నా, పుణె, సిల్చార్‌, తిరువనంతపురం.

సీట్ల వివరాలు: హైదరాబాద్‌ సెంటర్లో మొత్తం 480 సీట్లు ఉన్నాయి. అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ 140, బిగ్‌ డేటా అనలిటిక్స్‌లో 60, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ డిజైన్‌ 120, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సిస్టమ్స్‌ అండ్‌ సెక్యూరిటీ 40, వీఎల్‌ఎ్‌సఐ డిజైన్‌ 40, అడ్వాన్స్‌డ్‌ సెక్యూర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ 80 సీట్లు ఉన్నాయి. ఇక్కడ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ కోర్సును ఆన్‌లైన్‌ విధానంలో, మిగిలిన కోర్సులను ఫిజికల్‌ మోడ్‌లో నిర్వహిస్తారు. 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఐటీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌/ టెలి కమ్యూనికేషన్స్‌/ ఎలక్ట్రికల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులు; కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో ఎమ్మెస్సీ/ ఎంఎస్‌ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులకు నిర్దేశించిన తత్సమాన అర్హత సమాచారాన్ని వెబ్‌సైట్‌లో చూడవచ్చు.  

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ వివరాలు: ఇందులో ఎ, బి, సి అనే మూడు సెక్షన్‌లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌కు పరీక్ష సమయం గంట. ప్రతి సెక్షన్‌లో 50 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ‘ఎ’ సెక్షన్‌లో ఇంగ్లీష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ అంశాల నుంచి; ‘బి’ సెక్షన్‌లో కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, సీ - ప్రోగ్రామింగ్‌, డేటా స్ట్రక్చర్స్‌, ఆబ్జెక్ట్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ కాన్సెప్ట్స్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ అంశాల నుంచి; ‘సి’ సెక్షన్‌లో కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్‌, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌, మైక్రో ప్రాసెసర్స్‌ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు నిర్దేశించారు. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు. ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ డిజైన్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, రోబోటిక్స్‌ అండ్‌ అలైడ్‌ టెక్నాలజీస్‌ కోర్సులకు అన్ని సెక్షన్‌ల పేపర్‌లు రాయాలి. జియో ఇన్ఫర్మాటిక్స్‌ కోర్సుకు ‘ఎ’ సెక్షన్‌ పేపర్‌ రాస్తే చాలు. మిగిలిన కోర్సులకు ‘ఎ’, ‘బి’ సెక్షన్‌ల పేపర్‌లు రాయాల్సి ఉంటుంది.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: ‘ఎ’ సెక్షన్‌ పేపర్‌కు రూ.1350; ‘ఎ’ సెక్షన్‌ + ‘బి’ సెక్షన్‌ పేపర్‌లకు రూ.1550; ‘ఎ’ సెక్షన్‌ + ‘బి’ సెక్షన్‌ + ‘సి’ సెక్షన్‌ పేపర్‌లకు రూ.1750

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 12 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ

సి-డాక్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ తేదీలు: జూలై 23, 24

ఫలితాలు విడుదల: ఆగస్టు 4న

మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌: ఆగస్టు 4 నుంచి 10 వరకు

రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌: ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 1 వరకు   

అడ్మిషన్స్‌కు చివరి తేదీ: సెప్టెంబరు 13

వెబ్‌సైట్‌: www.cdac.in

Updated Date - 2022-07-01T21:26:23+05:30 IST