పేదలకు భరోసా

ABN , First Publish Date - 2020-05-29T09:26:53+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న ఆపన్నులను ఆదుకొనేందుకు అనేకమంది దాతలు ముందుకొస్తున్నారు.

పేదలకు భరోసా

గుంటూరు, మే 28: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న ఆపన్నులను ఆదుకొనేందుకు అనేకమంది దాతలు ముందుకొస్తున్నారు. బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు, కూరగాయలను అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌ ముప్పాళ్ల మురళీకృష్ణ 32వ డివిజన్‌లోని బ్రాడీపేటలో పేదలలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అయ్యప్పసేవా సంఘం ఆధ్వర్యంలో కల్యాణ మండపాలు, పునరావాస కేంద్రాల్లోల ఉంటున్న నిర్వాసితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ సొసైటీ అధ్యర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో  నిత్యావసరాలు, కురగాయలు పంపిణీ చేశారు.


మాజీమంత్రి శనక్కాయల అరుణ ఆధ్వర్యంలోని అహల్య ట్రస్ట్‌ సౌజన్యంతో 38వ డివిజన్‌ దుంప కరుణశ్రీ చేతుల మీదుగా 200 మందికి నిత్యావసరాల పంపిణీ నిర్వహిం చారు. దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో బొంగరాలబీడులో భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఏపీసీటీఎన్‌జీవో అసోసియేషన్‌ నరసరావుపేట డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు గోపీనాథ్‌, కిషోర్‌కుమార్‌ల ఆధ్వర్యంలో జిన్నాటవర్‌ సెంటర్‌లోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఉద్యోగులకు రాష్ట్ర నాయకుడు రామలింగం చేతుల మీదుగా మాస్కులు పంపిణీ చేశారు. 23వ డివి జన్‌లోని కన్నావారి తోట, నగరంపాలెంలో 200 పేద కుటుం బాలకు 10 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె ప్యాకెట్‌లను బీజేపీ, జనసేన కూటమి నాయకులు పంపిణీ చేశారు. 

Updated Date - 2020-05-29T09:26:53+05:30 IST