పీహెచ్‌సీలో మద్యం తాగిన ఘటనపై విచారణ

ABN , First Publish Date - 2020-11-28T06:36:24+05:30 IST

పీహెచ్‌సీలో మద్యం తాగిన ఘటనపై డీఎంహెచ్‌వో బి.రత్నావళి విచారణ చేశారు. శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ‘బార్‌గా మారిన గుంటుపల్లి పీహెచ్‌సీ’ కఽథనానికి డీఎంహెచ్‌వో స్పం దించారు.

పీహెచ్‌సీలో మద్యం తాగిన ఘటనపై విచారణ
ఆపరేషన్‌ థియేటర్‌లో కింద పరుపులను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డీఎంహెచ్‌వో రత్నావళి

బాధ్యులపై కఠిన చర్యలు 

డీఎంహెచ్‌వో 

 

బల్లికురవ, నవంబరు 27 :  పీహెచ్‌సీలో మద్యం తాగిన ఘటనపై డీఎంహెచ్‌వో బి.రత్నావళి విచారణ చేశారు. శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ‘బార్‌గా మారిన గుంటుపల్లి పీహెచ్‌సీ’ కఽథనానికి డీఎంహెచ్‌వో స్పం దించారు. ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికం గా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వైద్యాధికారులు భా నుప్రకా్‌షరావు, అమీర్‌ ఆలీ, ఎంపీహెచ్‌వో విజయచం ద్‌, వైద్యశాల సిబ్బందిని విచారించారు. ఇది వైద్యశాలా, లేక మీ సొంత ఇల్లు అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యశాల ఆవరణలో మద్యం తాగడం, వైద్యశాలను మూతవేయడంపై చర్యలు తీసుకుంటామ ని చెప్పారు. కొవిడ్‌ కేసుల వివరాలు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారని, రికార్డులు కూడా సక్రమంగా లేవని సిబ్బందిని నిలదీశారు. వార్డుల్లో బల్లలు అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ  డిప్యూటీ సీఎం, కలెక్టర్‌, ఆ దేశాల మేరకు సిబ్బంది నుంచి రాతపూర్వకంగా వివర ణ తీసుకున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామ ని తెలిపారు. అడిషినల్‌ డీఎంహెచ్‌వో మీనాక్షి మహదేవి, డిప్యూటీ డీఎంహెచ్‌వో మాధవీలత పాల్గొన్నారు.

ఆపరేషన్‌ థియేటరా.. పడక గదా.. 

ప్రాథమిక వైద్యశాల తనిఖీలో భాగంగా అపరేషన్‌ ఽథియేటర్‌ని పరిశీలించిన డీఎంహెచ్‌వో అక్కడ నేలపై పరుపు, దిండ్లు వేసి ఉండటం చూసి ఆగ్రహానికి గురయ్యారు. ఇది ఆపరేషన్‌ ఽథియేటరా లేక పడక గదా అని వైద్యాధికారి భానుప్రకా్‌షరావును ప్రశ్నించారు. థియేటర్‌లో ఏసీ వేసుకొని  నిద్రించటంపై స్థానికులు పలు అ నుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

 

Updated Date - 2020-11-28T06:36:24+05:30 IST