2021, ఏప్రిల్ నాటికి అమెరిన్లకు అందుబాటులో కరోనా వ్యాక్సిన్: డొనాల్డ్ ట్రంప్

ABN , First Publish Date - 2020-09-19T13:02:48+05:30 IST

ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందరికీ అందుబాటులోకి రానున్నదనే విషయాన్ని తెలియజేశారు. 2021 ఏప్రిల్ నాటికి అమెరికాలోని...

2021, ఏప్రిల్ నాటికి అమెరిన్లకు అందుబాటులో కరోనా వ్యాక్సిన్: డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందరికీ అందుబాటులోకి రానున్నదనే విషయాన్ని తెలియజేశారు. 2021 ఏప్రిల్ నాటికి అమెరికాలోని అందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నామని అన్నారు. కరోనా వ్యాక్సిన్ రాగానే ప్రభుత్వం అమెరికన్లందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతుందని అన్నారు. 



అమెరికాలోని వైద్యశాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని, మూడు వ్యాక్సిన్లకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయన్నారు. కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వీలైనంత త్వరగా టీకా తీసుకురావాల్సిన అవసరం ఉందని, అప్పుడే జనజీవనాన్ని పట్టాలపైకి తీసుకురాగలుగుతామని అన్నారు. ఒక టీకా ద్వారా కోట్లాదిమంది జీవితాలను రక్షించగలుగుతామని, వ్యాక్సిన్ తయారీ అనేది తమ ముందున్న ప్రధమ కర్తవ్యమని అన్నారు. వ్యాక్సిన్‌కు అనుమతి లభించిన 24 గంటల్లో దానిని పంపిణీకి సిద్ధం చేస్తామన్నారు. 

Updated Date - 2020-09-19T13:02:48+05:30 IST