ఆరేళ్లలో ఎనలేని అభివృద్ధి

ABN , First Publish Date - 2020-10-01T10:35:17+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరేళ్లలో రాష్ట్రంలో ఎనలేని అభివృద్ధి చేశారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ విప్‌ బాల్క

ఆరేళ్లలో ఎనలేని అభివృద్ధి

మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ 


మందమర్రిటౌన్‌, సెప్టెంబరు 30 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరేళ్లలో రాష్ట్రంలో ఎనలేని అభివృద్ధి చేశారని  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని మార్కెట్‌ సెంటర్‌లో  రూ. 40.10 కోట్లతో చేపట్టే మిషన్‌ భగీరథ అంతర్గత పైపులైన్‌ పనులకు మంత్రితో కలిసి విప్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సీమాంధ్ర నా యకుల పాలనలో తెలంగాణవాసులు అడుగడు గునా అన్యాయానికి గురయ్యారన్నారు. గతంలో ఎవరికి ప్రజల బాగోగులపై సోయి లేదని, తమ నేత అన్ని రంగాలను సమగ్ర అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారని చెప్పారు.  పాలక వర్గం లేని మందమర్రి మున్సిపాలిటీలో రూ. 50 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మందమర్రి మున్సిపాలిటీని పట్టి పీడిస్తున్న 1/70 చట్టాన్ని ఎత్తివేస్తేనే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి  చెందుతుందని తెలిపారు. విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికలు జరిపిస్తే తాము కూడా అభినందిస్తామని అన్నారు. ఇక్కడ 800లకు పైగా గృహాలు ఉంటే కేవలం 500 మాత్రమే ఉన్నాయని చెబుతున్నారని తెలిపారు.


కేవలం 4 శాతం జనాభా ఉన్న ఎస్టీలను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టం కొనసాగడం ద్వారా మందమర్రి అన్ని రంగాల్లో నష్టపోతుందన్నారు.  గతంలో రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ నీటితో అంగవైకల్యం పొంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం కింద సురక్షిత నీటిని అందించడం వల్ల ఫ్లోరైడ్‌ సమస్య తెలంగాణలో ఎక్కడ కూడా లేదని తెలిపారు.  ఈ సందర్భంగా తొలిసారి మంత్రి హోదాలో మందమర్రికి వచ్చిన సంక్షేమ శాఖ మంత్రికి తలపాగా, కత్తి ఇచ్చి  విప్‌ బాల్క సుమన్‌ ఘనంగా సన్మానించారు. కార్యకర్తలు గజమాలతో మంత్రి, విప్‌ను ఘనంగా సన్మానిం చారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను కలెక్టర్‌ భారతి హోళికేరి మంత్రికి వివరించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌లకు మందమర్రిలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడంతో మార్కెట్‌ ప్రాంతం కిక్కిరిసిపోయింది. టీఆర్‌ఎస్‌ నాయకులు మేడిపల్లి సంపత్‌, బడికెల సంపత్‌, జె. రవీందర్‌, ఓ. రాజశేఖర్‌, కొంగల తిరుపతిరెడ్డి, రాజ్‌కుమార్‌, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.  కాగా పట్టణ వ్యాపార సంఘం నాయకులు మంత్రి, విప్‌ను ఘనంగా సన్మానించారు. 

Updated Date - 2020-10-01T10:35:17+05:30 IST