ఎన్నాళ్లీ కష్టాలు..?

ABN , First Publish Date - 2022-06-29T05:49:37+05:30 IST

మండలకేంద్రంలోని రెడ్లపల్లి ఆంజనేయుల శెట్టి కాలనీవాసులు తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్నాళ్లీ కష్టాలు..?
ట్యాంకర్‌ నుంచి నీటిని కొనుగోలు చేస్తున్న కాలనీవాసి


తాగునీటికి అవస్థలు పడుతున్న రెడ్లపల్లి కాలనీ వాసులు

మూడేళ్లుగా పరిష్కారం కాని వైనం

గాండ్లపెంట, జూన 28: మండలకేంద్రంలోని రెడ్లపల్లి ఆంజనేయుల శెట్టి కాలనీవాసులు తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.  ఇంకె న్నిరోజులు అవస్థలు పడాలని వాపోతున్నారు. కాలనీలో కనీసం చేత పంపుకూడా లేదని కాలనీవాసలు సుమియా, రత్నమ్మ, శ్యామలమ్మ, ముంతాజ్‌, రమణ తదితరులు ఆవేదన చెందారు. రెడ్లపల్లి కాలనీలో నాలుగు సంవత్సరాల క్రితం ఇళ్లు నిర్మించుకుని, పంచాయతీ కొళాయిల కోసం ఒక్కొక్క ఇంటినుంచి రూ.3వేలు కార్యదర్శులకు చెల్లించామని తెలి పారు. అది నేటి వరకు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతి ఇంటికి జనజీవన పథకం ద్వారా ఉచితంగా నీటి కొళాయిలు అంది స్తామని రెండేళ్ల క్రితం ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, సర్పంచ చెప్పారని అంటున్నారు. అలాగే జనజీవన పథకం కింద రూ.10.15 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో బోరు వేసి, పైపులైనద్వారా ప్రతి ఇంటికి నీటిని అందించాల్సి ఉంది. ఈ పనిని ఓ క్రాంటాక్టర్‌కు అప్పగించారు. ఆయన సంవత ్సరం క్రితం పైపులైన వేసి బిల్లులు అందక పోవడంతో పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో కాలనీవాసులు ప్రతిఇంటికి రూ. ఐదువందలు చెల్లించి ట్యాంకర్లతో నీటిని కొంటున్నారు. సంవత్స రంగా పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తున్న తమకు ప్రతివా రం రూ.5వందలు చెల్లించాలంటే భారంగా ఉందన్నారు. ఈ సమస్యను మండల సర్వసభ్య సమావేశంలో విన్నవిస్తే వెంటనే పనులు ప్రారంభి స్తామంటున్నారేకానీ, ఇంతవరకు ఎలాంటి పనులు చేపట్టడంలేదని  ఇది తమకు తీరని సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బిల్లులు రాలేదని పనులు నిలిపేశాడు..- కిరణ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ

జనజీవన పథకంలో ఆ కాలనీవాసులకు ప్రతిఇంటికి కొళాయి ఇవ్వడానికి కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చామన్నారు. అతడు పైపులైన వేసి మిగిలిన పనులు నిలిపివేశాడు. బోరు, మోటారుకు నిధులు అందలేదని, పనులు నిలిపివేసినట్లు చెప్పాడు. 


Updated Date - 2022-06-29T05:49:37+05:30 IST