ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం

ABN , First Publish Date - 2022-01-22T04:10:09+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించటం తెలిసిందే..

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం

 ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

జిల్లాలోని మొత్తం1329 పాఠశాలలు

వీటిల్లో ఇప్పటికే 657 పాఠశాలల్లో బోధన

ఖమ్మంఖానాపురంహవేలి, జనవరి21: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించటం తెలిసిందే.. ఈ నేపథ్యంలో 2022-23 విద్యాసంవత్సరానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌మీడియంతోపాటు తెలుగుమీడియం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. దీంతో జిల్లాలోని మొత్తం1329 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి.ప్రస్తుతం 657 పాఠశాలల్లో ఇంగ్లీష్‌మీడియం బోధిస్తున్నారు. మిగిలిన 772 పాఠశాలల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ఇంగ్లీష్‌ మీడియం బోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడు తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులలో ఎక్కువశాతం తెలుగుమీడియం బోధించే ఉపాధ్యాయు లున్నారు. ఇంగ్లీష్‌మీడియం ప్రవేశపెడితే బోధించే ఉపాధ్యాయులను ప్రత్యేకంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతుంది. 1నుంచి 10వతరగతి విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే విద్యార్థుల్లో నైపుణ్యంతో పాటు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. 

విద్యార్థుల ఇష్టప్రకారమే మీడియం

విద్యార్థులు ఏమీడియంలో చేరాలన్నది వారి ఇష్టమేనని, వారు ఏమీడియంలో చేరినా అందకు తగినట్టుగా బోధన అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో తెలుగుతోపాటు ఇంగ్లీష్‌ మీడియంకూడా బోధిస్తున్నారు. దీంతో 1నుంచి 10వరకు ఇంగ్లీష్‌మీడియం అందుబాటులోకి తెస్తే ఇంటర్‌ ఆపై తరగతుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదివేందుకు వీలుంటుందని ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం ప్రైవేటు పాఠశలాల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువశాతం జాతీయ స్థాయి పోటీల్లో ముందు వరుసలో ఉంటున్నారని, దీనికి కారణంగా మొదటినుంచి ఇంగ్లీష్‌మీడియం చదివడమే కారణం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలా తక్కువసంఖ్యలో జాతీయస్థాయి పోటీల్లో ర్యాంకులు సాధిస్తున్నారు. ప్రభుత్వ ఇంగ్లీష్‌మీడియం ప్రవేశపెడితే జాతీయస్థాయి పోటీల్లో ప్రైవేటు పాఠశాల విద్యార్థులతోపాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ముందు వరుసలో ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. 

ఉపాధ్యాయుల నియామకంపై దృష్టి

1నుంచి5వతరగతి వరకు ఇంగ్లీష్‌మీడియం బోధించేందుకు ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యే శిక్షణ ఇచ్చి బోధించేందుకు వీలుగా ప్రయత్నాలు చేయవచ్చు. కానీ 6నుంచి10తరగతివిదాయర్థులకు ఇంగ్లీష్‌ మీడియం బోఽధించేందుకు ఉపాధ్యాయులను కేటాయించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు ఇంగ్లీష్‌మీడియం బోధించే విద్యార్థులు అతితక్కువ మంది ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం కొత్త ఉపాధ్యాయులను నియమిస్తుందా లేక ఉన్న ఉపాధ్యాయులనే నియమిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Updated Date - 2022-01-22T04:10:09+05:30 IST