ఇంగ్లండ్‌ మురిసింది

ABN , First Publish Date - 2020-07-21T09:10:57+05:30 IST

వెస్టిండీ్‌సతో రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 113 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు టెస్ట్‌ల సిరీ్‌సను 1-1తో సమం చేసింది. 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి ...

ఇంగ్లండ్‌ మురిసింది

ఇంగ్లండ్‌ సాధించింది..రెండో టెస్ట్‌లో అమోఘ విజయంతో మురిసింది..నాలుగు రోజులే జరిగిన మ్యాచ్‌లో పక్కా  ప్రణాళిక ప్రకారం ఆడి వెస్టిండీ్‌సను ఓడించింది..మరోవైపు తొలి టెస్ట్‌లో మాదిరిగా పర్యాటక జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శన చేయలేకపోయింది.. బ్యాటింగ్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది..


రెండో టెస్ట్‌లో ఘన విజయం

వెస్టిండీస్‌ 198 ఆలౌట్‌

స్టోక్స్‌ ఆల్‌రౌండ్‌ షో 

బ్రాడ్‌కు మూడు వికెట్లు


మాంచెస్టర్‌: వెస్టిండీ్‌సతో రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 113 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు టెస్ట్‌ల సిరీ్‌సను 1-1తో సమం చేసింది. 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 198 పరుగులకు ఆలౌటైంది. షమర్‌ బ్రూక్స్‌ (136 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), జర్మయిన్‌ బ్లాక్‌వుడ్‌ (88 బంతుల్లో 7 ఫోర్లతో 55) హాఫ్‌ సెంచరీలు చేశారు. కెప్టెన్‌ హోల్డర్‌ (35) పర్లేదనిపించాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ మూడు వికెట్లు తీయగా, వోక్స్‌, స్టోక్స్‌, బెస్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్‌ 129/3 స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. స్టోక్స్‌ (57 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రూట్‌ 22 పరుగులు చేశాడు. స్టోక్స్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్ట్‌ ఈనెల 24 నుంచి ఇక్కడే జరగనుంది. 

స్టోక్స్‌..స్ట్రోక్స్‌...: అంతకుముందు కిందటిరోజు స్కోరు 37/2తో చివరిరోజు ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించగా స్టోక్స్‌ చెలరేగిపోయాడు. ఉదయం రోచ్‌ వేసిన తొలి ఓవర్లోనే ఫోర్‌, సిక్స్‌తో తన ఉద్దేశం చాటి చెప్పాడు. అదే ఊపులో గాబ్రియల్‌ బంతిని లాంగాఫ్‌ దిశగా సిక్సర్‌గా మలిచి హాఫ్‌ సెంచరీ (36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)కి దూసుకు పోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా అర్ధ శతకం సాఽధించిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇక జోరుమీదున్న స్టోక్స్‌కు స్ట్రయిక్‌ ఇచ్చే ప్రయత్నంలో రూట్‌ తాను రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బెన్‌..ఆపై మరింత ఎదురు దాడికి దిగాడు. దాంతో 19 ఓవర్లలోనే ఇంగ్లండ్‌ 129/3తో  రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 

బ్రాడ్‌..భళా..: లక్ష్య ఛేదనలో..తొలి ఓవర్లనే బ్రాత్‌వైట్‌ను అవుట్‌ చేసిన బ్రాడ్‌ విండీ్‌సను కంగుతినిపించాడు. అనంతరం బ్రాత్‌వైట్‌,  హోప్‌ వికెట్‌ కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తూ ఆడారు. కానీ 8వ ఓవర్లో బ్రాత్‌వైట్‌ను వోక్స్‌ ఎల్బీగా బలిగొన్నాడు. వెంటనే హోప్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన బ్రాడ్‌ వెస్టిండీ్‌సను మళ్లీ దెబ్బకొట్టాడు. 25/3తో ఆ జట్టు భోజన విరామానికి వెళ్లగా.. రెండో సెషన్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే చేజ్‌ను ఎల్బీ చేయడం ద్వారా బ్రాడ్‌ ఇంగ్లండ్‌కు మరో బ్రేక్‌ ఇచ్చాడు. 

బ్రూక్స్‌, బ్లాక్‌వుడ్‌ సెంచరీ భాగస్వామ్యం: 37/4తో కరీబియన్లు కష్టాల్లో పడగా..ఆతిథ్య జట్టులో గెలుపుపై మరింత ఉత్సాహం ఏర్పడింది. కానీ ఇంగ్లండ్‌ ఆశలపై బ్రూక్స్‌, బ్లాక్‌వుడ్‌ నీళ్లు చల్లారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లు సంధిస్తూ ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌లో గుబులు రేపారు. ఈ తరుణంలో బ్లాక్‌వుడ్‌ను అవుట్‌ చేసిన స్టోక్స్‌ ఇంగ్లండ్‌ను మళ్లీ రేసులోకి తెచ్చాడు. తర్వాత బ్రూక్స్‌, కెప్టెన్‌ హోల్డర్‌ పోరాడినా..జట్టును ఓటమినుంచి గట్టెక్కించలేకపోయారు. 


స్కోరు బోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 469/9 (డిక్లేర్డ్‌), వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 287 ఆలౌట్‌; ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 19 ఓవర్లలో 129/3 (డిక్లేర్డ్‌); స్టోక్స్‌ 78 (నాటౌట్‌), రూట్‌ 22, పోప్‌ 12 (నాటౌట్‌); రోచ్‌  2/37; వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 70.1 ఓవర్లలో 198 ఆలౌట్‌; బ్రాత్‌వైట్‌ (ఎల్బీ) ఓక్స్‌ 12, క్యాంప్‌బెల్‌ (సి) బట్లర్‌ (బి) బ్రాడ్‌ 4, హోప్‌ (బి) బ్రాడ్‌ 7, బ్రూక్స్‌ (ఎల్బీ) కర్రాన్‌ 62, చేజ్‌ (ఎల్బీ) బ్రాడ్‌ 6, బ్లాక్‌వుడ్‌ (సి) బట్లర్‌ (బి) స్టోక్స్‌ 55, డౌరిచ్‌ (ఎల్బీ) ఓక్స్‌ 0, హోల్డర్‌ (బి) బెస్‌ 35, రోచ్‌ (సి) పోప్‌ (బి) బెస్‌ 5, జోసెఫ్‌ (సి) బెస్‌ (బి) స్టోక్స్‌ 9, గాబ్రియెల్‌ 0 (నాటౌట్‌); ఎక్స్‌ట్రాలు: 3; వికెట్ల పతనం : 1-7, 2-19, 3-23, 4-37, 5-137, 6-138, 7-161, 8-183, 9-192; బౌలింగ్‌: బ్రాడ్‌ 15-5-42-3, వోక్స్‌ 16-3-34-2, కర్రాన్‌ 8-3-30-1, బెస్‌ 15.1-3-59-2, స్టోక్స్‌ 14.4-4-30-2, రూట్‌ 1.2-1-0-0.


Updated Date - 2020-07-21T09:10:57+05:30 IST