బట్లర్, ఓక్స్ ముందుంది నడింపించారు

ABN , First Publish Date - 2020-08-09T21:37:02+05:30 IST

పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు నువ్వానేనా అంటూ పోటీ..

బట్లర్, ఓక్స్ ముందుంది నడింపించారు

లండన్: పాకీస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు నువ్వానేనా అంటూ పోటీ పడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ పట్టు సాధిస్తే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ అద్భుతమైన ఆటతో విజయం సాధించింది. 277 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తక్కువ స్కోరుకే 5 వికెట్లు కోల్పోయినా బట్లర్, ఓక్స్ ముందుండి జట్టును నడిపించారు. చక్కటి ఆటతో విజయాన్ని అందించారు. దీంతో నాలుగోరోజు ఆట మరికొన్ని ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ గెలిచింది. ఓవర్ నైట్ స్కోరు 137/8తో పాకీస్తాన్ నాలుగోరోజు ఆటను ప్రారంభించింది. అయితే మరో 32 పరుగులు జోడించి మిగతా 2 వికెట్లను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ తక్కువ స్కోరుకే తొలి రెండు వికెట్లు చేజార్చుకుంది. కెప్టెన్ రూట్ స్కోరు బోర్డును ముందుకు నడిపించే ప్రయత్నం చేసినా 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. నసీమ్ షా బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న బాబర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత బెన్ స్టోక్స్, ఓలీ పోప్‌‌లు రెండంకెల స్కోరు కూడా చేయకుండా వెనుదిరిగారు. దీంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది.


విజయానికి ఇంగ్లాండ్ ఇంకా 160 పరుగుల దూరంలో ఉంది. ఆ సమయంలో బట్లర్, ఓక్స్ సంయమనంతో ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఎక్కువగా సింగిల్స్‌పైనే ఆధార పడుతూ అడపాదడపా బౌండరీలు కొట్టసాగారు. దీంతో స్కోర్ బోర్డు నెమ్మదిగా కదిలింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ అర్థసెంచరీలు పూర్తి చేసుకున్నారు. జట్టును విజయానికి చేరువ చేశారు. గెలుపునకు మరో 20 పరుగులు దూరంలో ఉండగా బట్లర్ ఔటయ్యాడు. ఆ తరువాత బ్రాడ్ కూడా వెంటనే ఓటయినా స్టోక్స్ లాంఛనం పూర్తి చేశాడు.

Updated Date - 2020-08-09T21:37:02+05:30 IST