బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ బంపర్ విక్టరీ

ABN , First Publish Date - 2021-10-28T01:11:25+05:30 IST

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు బంపర్ విక్టరీ నమోదు చేసింది.

బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ బంపర్ విక్టరీ

అబుదాబి: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు బంపర్ విక్టరీ నమోదు చేసింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాను మట్టికరిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ (29) టాప్‌స్కోరర్‌గా నిలిస్తే, కెప్టెన్ మహ్మదుల్లా(19), నసం అహ్మద్(19)  పరుగులతో పర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మిల్స్(03) వికెట్లు.. మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 125 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.


ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ జేసన్ రాయ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ జాస్ బట్లర్ 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివరకు డేవిడ్ మలాన్(28, నాటౌట్), జాన్ బెయిర్‌స్టో(08, నాటౌట్) పరుగులతో ఇంగ్లాండ్‌కు సునాయాస విజయాన్ని అందించారు. ఇంకా 35 బంతులు మిగిలి ఉండానే ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడిన జేసన్ రాయ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. వరుసగా రెండు విజయాలతో ఇంగ్లాండ్ ప్రస్తుతం గ్రూప్-1లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది.   

Updated Date - 2021-10-28T01:11:25+05:30 IST