Abn logo
Oct 22 2021 @ 20:54PM

భారత్-ఇంగ్లండ్ మధ్య ఆగిపోయిన ఐదో టెస్టు రీషెడ్యూల్

న్యూఢిల్లీ: కరోనా కారణంగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఆగిపోయిన ఐదో టెస్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రీషెడ్యూల్ చేసింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా సెప్టెంబరులో ఇరు జట్ల మధ్య జరగాల్సిన చివరి టెస్టు ఆగిపోయింది. ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ఇప్పటి వరకు సందేహాలు ఉండగా, ఇప్పుడు వాటికి తెరదించుతూ వచ్చే ఏడాది జులై 1వ తేదీకి ఆ టెస్టును రీ షెడ్యూల్ చేస్తున్నట్టు ఈసీబీ ప్రకటించింది. ఇంగ్లండ్‌లో జరిగిన ఈ టెస్టు సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది.

ఆగిపోయిన ఐదో టెస్టు ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతుందని, అనంతరం 3 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌లు జరుగుతాయని శుక్రవారి ఈసీబీ స్పష్టం చేసింది. మ్యాచ్ రీషెడ్యూల్‌పై బీసీసీఐ కార్యదర్శి జేషా హర్షం వ్యక్తం చేశారు. టెస్టు సిరీస్‌కు సరైన ముగింపు లభిస్తుందని అన్నారు. రెండు జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ మాంచెస్టర్‌లో జరగాల్సి ఉండగా భారత శిబిరంలోని సిబ్బంది కరోనా బారినపడడంతో మ్యాచ్‌ రద్దయింది.


ఆగిపోయిన చివరి టెస్టు వచ్చే ఏడాది జులైన 1-5 మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుండగా, 7న ఏజీస్ బౌల్‌లో తొలి టీ20, 9న ఎడ్జ్‌బాస్ట్‌లో రెండో టీ20, ట్రెంట్ బ్రిడ్జ్‌లో 10న మూడో టీ20 జరుగుతాయి. ఆ తర్వాత జులై 12న కియా ఓవల్‌లో తొలి వన్డే, లార్డ్స్‌లో 4న రెండో వన్డే, ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మూడో వన్డే జరుగుతుంది. 

ఇవి కూడా చదవండిImage Caption