Abn logo
Jan 25 2021 @ 03:58AM

రూట్‌ భారీ శతకం

  • ఇంగ్లండ్‌ 339/9
  • శ్రీలంకతో చివరి టెస్టు

గాలె: శ్రీలంకతో ఆఖరి, రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ (186) భారీ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. రూట్‌ శతక ప్రదర్శనతో.. ఓవర్‌నైట్‌ స్కోరు 98/2తో మూడో రోజైన ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ ఆట చివరకు 9 వికెట్లకు 339 పరుగులు చేసింది. రూట్‌కు కెరీర్‌లో ఇది 19వ శతకం. జోస్‌ బట్లర్‌ (55) అర్ధ సెంచరీతో మెరిశాడు. బెస్‌ 32,  బెయిర్‌స్టో 28 రన్స్‌ చేశారు. లంక స్పిన్నర్‌ లసిత్‌ ఎంబల్డెనియా (7/132) ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. ప్రస్తుతం పర్యాటక జట్టు 42 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో లంక 381 స్కోరు చేసింది.

Advertisement
Advertisement
Advertisement