ధోనీ రికార్డు బద్దలు కొట్టిన మోర్గాన్

ABN , First Publish Date - 2020-08-05T02:29:23+05:30 IST

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ బద్దలు కొట్టాడు. ఈ మేరకు ఐసీసీ తాజాగా....

ధోనీ రికార్డు బద్దలు కొట్టిన మోర్గాన్

లండన్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ బద్దలు కొట్టాడు. ఈ మేరకు ఐసీసీ తాజాగా ప్రకటించిన జాబితా ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో అత్యధిక సిక్సులు కొట్టిన కెప్టెన్‌గా ధోనీ(211) ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్-ఐర్లాండ్ వన్‌డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా నేడు మూడో వన్‌డే మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌కు ముందు ధోనీతో సమానంగా 211 సిక్స్‌లతో ఉన్న మోర్గాన్ మ్యాచ్ అనంతరం తొలి స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన తొలి సిక్స్ సాధించడం ద్వారా మోర్గాన్(212) ఈ ఫీట్ సాధించాడు. ఇదిలా ఉంటే ధోనీ తన 332 మ్యాచ్‌లలో 211 సిక్సులు కొట్టగా మోర్గాన్ మాత్రం కేవలం 163 మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించాడు.

Updated Date - 2020-08-05T02:29:23+05:30 IST