Abn logo
Aug 3 2020 @ 03:28AM

ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్‌

సౌతాంప్టన్‌: ఐర్లాండ్‌ను విశ్వవిజేత ఇంగ్లండ్‌ మరోసారి చిత్తు చేసింది. మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా శనివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) ముగిసిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ నాలు గు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మరో వన్డే మిగిలుండగానే సిరీస్‌ను ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఐర్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 212 పరుగులు చేసింది. కాంఫర్‌ (68) అర్ధశతకంతో రాణించాడు. అనంతరం ఆతిథ్య జట్టు 213 పరుగుల లక్ష్యాన్ని 32.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌  జానీ బెయిర్‌స్టో (82) జట్టులో టాప్‌ స్కోరర్‌. సామ్‌ బిల్లింగ్స్‌ 46, డేవిడ్‌ విల్లే 47 పరుగులు చేశారు. నామమాత్రమైన మూడో వన్డే మంగళవారం జరగనుంది.

Advertisement
Advertisement
Advertisement