వేతనాల్లో 15 శాతం కోతకు అంగీకరించిన ఇంగ్లండ్ క్రికెటర్లు

ABN , First Publish Date - 2020-10-24T00:01:34+05:30 IST

ఇంగ్లండ్ అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడుతున్నప్పటికీ, మహమ్మారి కారణంగా కనీసం 106 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు(జీబీపీ) కోల్పోయే అవకాశం ఉందని

వేతనాల్లో 15 శాతం కోతకు అంగీకరించిన ఇంగ్లండ్ క్రికెటర్లు

న్యూఢిల్లీ: కొవిడ్-19 కారణంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆర్థిక కష్టాల్లో చిక్కుకుపోవడంపై క్రికెటర్లు స్పందించారు. తమ వార్షిక వేతనంలో 15 శాతం కోతకు అంగీకరించారు. ఈ వేసవి నుంచి ఇంగ్లండ్ అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడుతున్నప్పటికీ, మహమ్మారి కారణంగా కనీసం 106 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు(జీబీపీ) కోల్పోయే అవకాశం ఉందని, ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉందని ఈసీబీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా 62 మంది సిబ్బందిపై వేటు వేయనున్నట్టు ప్రకటించింది. అలాగే, క్రికెట్‌లోని ఇతర విభాగాల్లోనూ మున్ముందు కోతలు తప్పవని పేర్కొన్నారు. 

 

వేసవి మొదట్లో ఇంగ్లండ్ పురుషుల జాతీయ జట్టు 5 లక్షల జీబీపీలను ఈసీబీకి విరాళంగా ఇచ్చింది. ఇప్పుడు వచ్చే ఏడాది కాలానికి తమ రెమ్యునరేషన్‌లో 15 శాతం కోతకు అంగీకరించింది. ఇందులో సెంట్రల్ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజులు, బోనస్‌లు కూడా ఉంటాయి. ఈ కోతలు ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తాయి. వేతనాల్లో కోతకు క్రికెటర్లు అంగీకరించడంపై ఈసీబీ ఎండీ ఆష్లే గైల్స్ హర్షం వ్యక్తం చేశాడు.   

Updated Date - 2020-10-24T00:01:34+05:30 IST