చెలరేగుతున్న సిరాజ్.. పెవిలియన్‌కు బెయిర్‌స్టో, రూట్

ABN , First Publish Date - 2022-07-17T21:28:42+05:30 IST

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆదిలోనే ఇంగ్లండ్‌కు కష్టాలు ఎదురయ్యాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన

చెలరేగుతున్న సిరాజ్.. పెవిలియన్‌కు బెయిర్‌స్టో, రూట్

మాంచెస్టర్: భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆదిలోనే ఇంగ్లండ్‌కు కష్టాలు ఎదురయ్యాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను సిరాజ్ దారుణంగా దెబ్బతీశాడు. బుమ్రా స్థానంలోకి వచ్చిన సిరాజ్ నిప్పులు చెరిగే బంతులు సంధిస్తున్నాడు. అతడి బంతులను ఎదుర్కోలేని బెయిర్‌స్టో, జో రూట్ ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిశాయి. ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. జాసన్ రాయ్ (20), బెన్‌స్టోక్స్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2022-07-17T21:28:42+05:30 IST