కోహ్లీ చేసిన పనికి ఏడుస్తూనే నవ్వుకున్నా: మైకెల్ వాగన్

ABN , First Publish Date - 2021-08-15T08:37:42+05:30 IST

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 180 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే అతడి వికెట్ కోసం..

కోహ్లీ చేసిన పనికి ఏడుస్తూనే నవ్వుకున్నా: మైకెల్ వాగన్

లండన్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 180 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే అతడి వికెట్ కోసం రెండు సార్లు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డీఆర్‌ఎస్‌కు వెళ్లినా ప్రతికూల ఫలితమే వచ్చింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మైకెల్ వాగన్.. రివ్యూల విషయంలో భారత జట్టు చాలా పేలవ ప్రదర్శన చేస్తోందని విమర్శించాడు. 


డీఆర్‌ఎస్ కోసం నిర్ణయం తీసుకోవడంలో కోహ్లీ విఫలం అవుతున్నాడని, జో రూట్‌ను అవుట్ చేయాలనే ఆలోచనతో వరుస ఓవర్లలో రెండు సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో తాను ఏడుస్తూనే నవ్వుకున్నానని అన్నాడు. అయితే ఈ విషయంలో కోహ్లీని మాత్రమే తప్పుబట్టలేమని, డీఆర్ఎస్‌కు వెళ్లాలా వద్దా..? అనే నిర్ణయంలో కీపర్ రిషబ్ పంత్ సహకారం కోహ్లీకి కరువైందని, దానికి తోడు పేసర్ సిరాజ్ మొండి పట్టు.. వెరసి రెండు వరుస ఓవర్లలో విలువైన రెండు డీఆర్ఎస్ రివ్యూలను భారత్ కోల్పోయిందని వాగన్ అభిప్రాయపడ్డాడు. 

Updated Date - 2021-08-15T08:37:42+05:30 IST