Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంగ్లండ్‌ ఢమాల్‌

  • 147 ఆలౌట్‌ 
  • కమిన్స్‌కు ఐదు వికెట్లు
  • యాషెస్‌ తొలి టెస్ట్‌

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ప్యాట్‌ కమిన్స్‌కు అద్భుత ఆరంభం లభించింది. ఇంగ్లండ్‌తో బుధవారం మొదలైన యాషెస్‌ మొదటి టెస్ట్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు. తొలి ఓవర్‌ మొదటి బంతికే బర్న్స్‌ వికెట్‌ పడగొట్టి స్టార్క్‌ దెబ్బ తీయగా..ఆ తర్వాత కమిన్స్‌ ఇంగ్లండ్‌ పనిపట్టాడు. పచ్చికతో కళకళలాడుతున్న పిచ్‌.. మబ్బుపట్టిన వాతావరణం తోడుగా బంతి విపరీతంగా స్వింగ్‌, బౌన్స్‌ అవడాన్ని చక్కగా ఉపయోగించుకున్న కమిన్స్‌, స్టార్క్‌, హాజెల్‌వుడ్‌ త్రయం ఇంగ్లండ్‌ వెన్ను విరిచింది.


ఫలితంగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పర్యాటక జట్టు 50.1 ఓవర్లలోనే తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకు చాపచుట్టేసింది. బట్లర్‌ (39), ఒలీ పోప్‌ (35), ఓపెనర్‌ హసీబ్‌ హమీద్‌ (25) మాత్రమే రాణించారు. టీ సమయానికి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగియగా అనంతరం జోరుగా వాన కురియడంతో మూడో సెషన్‌ ఆట రద్దయింది. ఇక 1936 తర్వాత ఆస్ట్రేలియాలో యాషెస్‌ ఆరంభ టెస్ట్‌ తొలి ఓవర్‌ మొదటి బంతికే ఇంగ్లండ్‌ వికెట్‌ కోల్పోవడం ఇది మొదటిసారి.

Advertisement
Advertisement