క్రికెట్‌పై కరోనా ఎఫెక్ట్.. ఇంగ్లండ్ క్రికెటర్ల భారీ విరాళం

ABN , First Publish Date - 2020-04-04T21:51:42+05:30 IST

ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి క్రికెట్‌పై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న

క్రికెట్‌పై కరోనా ఎఫెక్ట్.. ఇంగ్లండ్ క్రికెటర్ల భారీ విరాళం

లండన్: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి క్రికెట్‌పై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్లు రద్దయ్యాయి. ఈ క్రమంలో ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడింది. ఈ ఆర్థిక సంక్షోభాన్ని తీర్చేందుకు ఇంగ్లండ్ బోర్డు కాంట్రాక్ట్ క్రికెటర్లు ముందుకొచ్చారు. ఇందుకోసం 5లక్షల పౌండ్లను ప్రాథమిక విరాళంగా అందించనున్నట్లు ప్రొఫెషనల్ క్రికెటర్ల అసోసియేషన్(పీసీఏ) శుక్రవారం ప్రకటించింది. అంతకు ముందే ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ తన వేతనం నుంచి స్వచ్ఛందంగా 25శాతాన్ని కోత విధించుకున్న విషయం తెలిసిందే.

 

కరోనా వ్యాప్తి కారణంగా మే 28 వరకూ ఇంగ్లండ్‌లో జరగాల్సిన అన్ని టోర్నమెంట్లు రద్దయ్యాయి. ఆ తర్వాత జరగాల్సిన వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ పర్యటనలపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇంగ్లండ్ బోర్డు అందరి వేతనాలలో కోత విధించి 61 మిలియన్ల పౌండ్లు విరాళంగా ఇచ్చింది. అయితే నెలకు కనీసం ఒక మిలియన్ పౌండ్లు వరకూ వేతనంగా అందుకొనే టెస్ట్ కెప్టెన్ జో రూట్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వంటి వారి వేతనాల్లో కూడా కోత విధిస్తారా అనే ప్రశ్నలు కూడా పుట్టుకొచ్చాయి. దీంతో పీసీఏ దీనిపై సమావేశం అయింది. ‘‘ఇంగ్లండ్ ప్రధాన కాంట్రాక్ట్ కలిగిన క్రికెటర్లు ఒక్కోక్కరు వచ్చే మూడు నెలలకి సంబంధించి తమ వేతనాల్లో 20 శాతం కోత విధించుకొని 0.5 మిలియన్లు ప్రాథమిక విరాళంగా అందిస్తారు ఈసీబీకి అందిస్తారు’’ అని పీసీఏ సమావేశం అనంతరం ప్రకటించింది. వన్డే జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా తన వేతనంలో కోత విధించేందుకు అంగీకరిస్తున్నానని అన్నాడు. అంతకు ముందే మహిళా క్రికెటర్లు ఇందుకు అంగీకరించారు. 

Updated Date - 2020-04-04T21:51:42+05:30 IST