‘విజ్డెన్‌ లీడింగ్‌ క్రికెటర్‌ ఇన్‌ ది వరల్డ్‌’గా స్టోక్స్‌

ABN , First Publish Date - 2020-04-09T10:00:43+05:30 IST

ప్రతిష్ఠాత్మక ‘విజ్డెన్‌ లీడింగ్‌ క్రికెటర్‌ ఇన్‌ ది వరల్‌’్డగా ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఎంపియ్యాడు. ఈ క్రమం లో గత మూడేళ్లుగా ఈ అవార్డును సొంతం చేసుకుంటున్న...

‘విజ్డెన్‌ లీడింగ్‌ క్రికెటర్‌ ఇన్‌ ది వరల్డ్‌’గా స్టోక్స్‌

లండన్‌: ప్రతిష్ఠాత్మక ‘విజ్డెన్‌ లీడింగ్‌ క్రికెటర్‌ ఇన్‌ ది వరల్‌’్డగా ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఎంపియ్యాడు. ఈ క్రమం లో గత మూడేళ్లుగా ఈ అవార్డును సొంతం చేసుకుంటున్న కోహ్లీ ఆధిపత్యానికి గండికొట్టాడు. 2019 లో అద్భుత ప్రదర్శన చేసినందుకుగాను స్టోక్స్‌కు ఈ గౌరవం దక్కింది. ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ సాధించడంలో స్టోక్స్‌ కీలకపాత్ర పోషించాడు. 2005లో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తర్వాత ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి ఇంగ్లండ్‌ ప్లేయర్‌గా స్టోక్స్‌ నిలిచాడు. 28 ఏళ్ల స్టోక్స్‌ 2019లో టెస్ట్‌ల్లో 821 పరుగులు, వన్డేల్లో 719 పరుగులు సాధించాడు. ఇక, ‘లీడింగ్‌ ఉమన్‌ క్రికెటర్‌ ఇన్‌ ది వరల్డ్‌’గా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ ఎంపికైనట్టు 2020 విజ్డెన్‌ క్రికెటర్స్‌ అల్మనాక్‌ ఎడిషన్‌లో ప్రచురించారు. టీమిండియా బ్యాట్స్‌వుమన్‌ స్మృతి మంధాన నుంచి ఈ టైటిల్‌ పెర్రీ కైవసం చేసుకుంది. మహిళల యాషె్‌సలో పెర్రీ అద్భుత ప్రదర్శన చేసింది. 

Updated Date - 2020-04-09T10:00:43+05:30 IST