లండన్: భారత్ పిచ్‌లపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంపై అసలది టెస్టు పిచ్ కానేకాదని, ఐసీసీ విచారణ జరపాలని అతడిప్పటికే డిమాండ్ చేశాడు. ఇక నాలుగో టెస్టు వికెట్‌పైనా వ్యంగ్య రీతిలో స్పందిస్తూ ఫొటోను షేర్ చేశాడు ఇందులో పూర్తిగా తవ్విన మట్టిపై నిలబడి ఉన్న వాన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ‘నాలుగో టెస్టు కోసం సన్నాహకాలు అద్భుతంగా జరుగుతున్నాయి’ అంటూ కామెంట్ చేశాడు.