BHELలో ఇంజనీర్లు, సూపర్‌వైజర్లు

ABN , First Publish Date - 2021-12-01T17:48:01+05:30 IST

నాగ్‌పూర్‌లోని..

BHELలో ఇంజనీర్లు, సూపర్‌వైజర్లు

నాగ్‌పూర్‌లోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌)... నిర్ణీతకాల ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 16

ఇంజనీరింగ్‌(సివిల్‌): 08

సూపర్‌ వైజర్‌(సివిల్‌): 08

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 2021 నవంబరు 21 నాటికి 40 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: ఇంజనీర్‌ పోస్టులకు నెలకు రూ.71,040, సూపర్‌వైజర్‌ పోస్టులకు నెలకు రూ.39,670 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆ్‌ఫలైన్‌ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 07

దరఖాస్తు హార్డు కాపీలను పంపడానికి చివరి తేదీ: డిసెంబరు 10

వెబ్‌సైట్‌: https://careers.bhel.in:8443/bhel/ static/Adv_No_2021.pdf

Updated Date - 2021-12-01T17:48:01+05:30 IST