Counselling: 25 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2022-08-09T14:00:14+05:30 IST

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించిన కౌన్సెలింగ్‌(Counselling) ఈ నెల 25న ప్రారంభమై సెప్టెంబరు 21 వరకు

Counselling: 25 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

చెన్నై, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించిన కౌన్సెలింగ్‌(Counselling) ఈ నెల 25న ప్రారంభమై సెప్టెంబరు 21 వరకు జరుగనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లకు దరఖాస్తు స్వీకరణ జూన్‌ 20న ప్రారంభమై జూలై 19వ తేదీతో ముగిసింది. కానీ, సీబీఎస్ఈ ఫలితాలు విడుదల జాప్యం కావడంతో దరఖాస్తుల స్వీకరణ గడువు జూలై 27 వరకు పొడిగించారు. ప్రస్తుతం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తికాగా, ‘నీట్‌’ ఫలితాలు వెలువడిన తర్వాత ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌(Engineering Counselling) ప్రారంభించాలని భావించారు. ఈ నేపథ్యంలో, స్థానిక సచివాలయంలో సోమవారం ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి(Education Minister Ponmudi) విలేఖరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ ఈ నెల 25న ప్రారంభమైన సెప్టెంబరు 21వ తేది వరకు జరుగుతుందన్నారు. ఇంజనీరింగ్‌, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు పటిష్టంగా అమలుచేసేలా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-08-09T14:00:14+05:30 IST