Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇటీవలే నిశ్చితార్థం.. ఇంతలోనే ఏమైందో.. యువతి ఆత్మహత్య

హైదరాబాద్ సిటీ/బర్కత్‌పుర : వివాహం నిశ్చయమైంది. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. అంతలోనే ఏమైందో.. ఆ యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... చప్పల్‌బజార్‌లో నివాసముంటున్న మల్లికార్జున్‌ కుమార్తె సురేఖ(26) బ్యూటీపార్లర్‌లో పని చేస్తోంది. ఇటీవల నిశ్చితార్థం కూడా అయ్యింది. కాగా, శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య ఎందుకు చేసుకుందన్న వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement