ENG vs IND ODI: ఇంగ్లండ్‌ బ్యాటింగ్ ఇలా ఉందేంటి.. పది ఓవర్ల లోపే ఇన్ని వికెట్లు ఫట్టా..!

ABN , First Publish Date - 2022-07-12T23:43:41+05:30 IST

టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఆదిలోనే తడబడింది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో..

ENG vs IND ODI: ఇంగ్లండ్‌ బ్యాటింగ్ ఇలా ఉందేంటి.. పది ఓవర్ల లోపే ఇన్ని వికెట్లు ఫట్టా..!

ఓవల్: టీమిండియా, ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఓవల్ (Oval) వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో (1st ODI) ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు (ENGLAND) ఆదిలోనే తడబడింది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు పది ఓవర్ల లోపే నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. బూమ్రా (Jasprit Bumrah) బౌలింగ్ చేసిన రెండో ఓవర్‌లో నాలుగో బంతికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జాసన్ రాయ్ (Jason Roy) క్లీన్ బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రూట్ (Root) కూడా అదే ఓవర్‌లో చివరి బంతికి పంత్‌కు (Pant) క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత షమీ (Shami) బౌలింగ్ చేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి బెన్ స్టోక్స్ (Ben Stokes) పంత్‌కు క్యాచ్‌గా చిక్కి ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔట్ కావడంతో మూడు ఓవర్లు ముగిసేలోపే మూడు కీలక వికెట్లను కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత బెయిర్ స్టో (Jonny Bairstow) కూడా బూమ్రా బౌలింగ్ చేసిన ఆరో ఓవర్ మూడో బంతికి పంత్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టడంతో ఇంగ్లండ్ జట్టు నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది.



పట్టుమని పది ఓవర్లు కూడా ముగియక ముందే ఇంగ్లండ్ జట్టు (England) నాలుగు కీలక వికెట్లు చేజార్చుకోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఈ వార్త రాసే సమయానికి ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 6 ఓవర్లకు 22 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో దాదాపుగా విఫలమైన ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ను నమ్ముకోక తప్పేలా లేదు. బౌలింగ్‌లో స్పెషలిస్ట్‌ పేసర్లు టోప్లే, బ్రైడన్‌ కార్స్‌తో పాటు ఆల్‌రౌండర్ స్టోక్స్‌, బౌలర్లు ఓవర్‌టన్, డేవిడ్‌ విల్లే అందుబాటులో ఉండడం సానుకూలాంశం.

Updated Date - 2022-07-12T23:43:41+05:30 IST