covid testing scam: ఒకే మొబైల్ నెంబర్.. ఒకటే అడ్రస్.. వందల మందికి కోవిడ్ టెస్ట్..

ABN , First Publish Date - 2021-08-07T08:02:23+05:30 IST

కుంభమేళాలో జరిగిన కోవిడ్ టెస్టింగ్ స్కాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముమ్మర దర్యాప్తు సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ..

covid testing scam: ఒకే మొబైల్ నెంబర్.. ఒకటే అడ్రస్.. వందల మందికి కోవిడ్ టెస్ట్..

న్యూఢిల్లీ: కుంభమేళాలో జరిగిన కోవిడ్ టెస్టింగ్ స్కాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముమ్మర దర్యాప్తు సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎన్‌సీఆర్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లోని అనేక ల్యాబొరేటరీల్లో రైడ్స్ చేసింది. ఈ క్రమంలో విస్తుపోయే ఆధారాలు ఈడీ చేతికి చిక్కాయి. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ల్యాబ్స్ అన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వాలే కాంట్రాక్టులిచ్చాయి. కుంభమేళాకు హాజరయ్యే వారందరికీ కోవిడ్ పరీక్షలు చేయాల్సిందిగా ఈ ల్యాబ్ యాజమాన్యాలను ప్రభుత్వాలు ఆదేశించాయి. 


అయితే ఈ క్రమంలో ల్యాబ్‌లు ఓ పెద్ద స్కాం చేసినట్లు ఆరోపణలొచ్చాయి. విచారణ కోసం ఈడీ రంగంలోకి దిగింది. ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఒకే మొబైల్ నెంబర్, ఒకే అడ్రస్‌తో ఎంతో మందికి కోవిడ్ టెస్ట్ చేసినట్లు తెలుపుతూ నివేదికలు తయారు చేశాయి. ఈ విషయాన్ని ఈడీ కనిపెట్టింది. అంటే పరీక్షలు చేయకుండానే ఎంతోమందికి పరీక్షలు నిర్వహించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించాయి. దీనిపై విచారణ మరింత వేగంగా చేయనున్నట్లు ఈడీ ప్రకటించింది.

Updated Date - 2021-08-07T08:02:23+05:30 IST